టాలీవుడ్ లో యంగ్ హీరో లలో మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోలలో విజయ్ దేవరకొండ కూడ ఒకరు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ఒక సినిమా గతంలో అనౌన్స్మెంట్ జరిగింది. అయితే ఈ చిత్రం రెండు సంవత్సరాల క్రితమే అనౌన్స్మెంట్ జరగగా ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. పుష్ప సినిమా కంటే ముందు ఈ చిత్రం ప్రకటించగా పుష్ప మొదటి భాగం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో సుకుమార్ రేంజ్ ఒకసారిగా పెరిగిపోయింది. పుష్ప -2 సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు దాదాపుగా క్యాన్సిల్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.

లైగర్ సినిమాతో  విజయ్ దేవరకొండ భారీ డిజాస్టర్ కావడంతో.. కథ నచ్చకపోతే నిర్మమాటంగా వద్దని చెబుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సుకుమార్ సినిమా కథ ఇంకా ఫైనల్ అవ్వలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరోపక్క విజయ్ దేవరకొండ కి ఇతర ఆఫర్లు వస్తున్న.. పుష్ప -2 సినిమా తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండ తో కన్న రాంచరణ్ తో సినిమా చేసేందుకే చాలా ఆసక్తికరంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి నిర్మాతలు విషయంలో తగిన నిర్ణయాలు తీసుకున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.


ఇక దీంతో మరొకసారి రంగస్థలం సినిమా కాంబినేషన్ సెట్ అయిందని వార్తలు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తూ ఉన్నాయి. ఇక సుకుమార్ తో విజయ్ దేవరకొండ సినిమా ప్రస్తుతానికి వాయిదా పడిందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సమంత తో కలిసి ఖుషి సినిమాలో నటిస్తూ ఉన్నారు. కేవలం విజయ్ దేవరకొండ కెరియర్ మొత్తం ఈ సినిమా మీద ఆధారపడిందని చెప్పవచ్చు. దాదాపుగా ఇప్పటికే వరుస ప్లాపులతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండకు మరి ఈ సినిమా ఊరటని ఇస్తుందో లేదా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: