టాప్ హీరోల ఫేవరేట్ దర్శకుడుగా ఒక వెలుగు వెలిగిన కొరటాల శివ కు ఒకేఒక్క ఫ్లాప్ ‘ఆచార్య’ అతడి ఇమేజ్ ని దెబ్బ తీసింది. వాస్తవానికి ఒక్క రాజమౌళికి మినహా టాప్ డైరెక్టర్స్ అందరికీ ఏదో ఒక సందర్భంలో ఫెయిల్యూర్ లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఒకే ఒక్క ఫ్లాప్ తో కొరటాల పై ఎందుకు ఇంత నెగిటివ్ ప్రచారం జరిగిందో ఎవరికీ అర్థంకాని విషయంగా మారింది.



జూనియర్ తో కొరటాల తీయవలసిన మూవీ ఎప్పుడో ప్రారంభం కావలసి ఉన్నప్పటికీ రకరకాల కారణాలతో ఈమూవీ ప్రారంభం వాయిదా పడుతూ వచ్చింది. వాస్తవానికి జూనియర్ ను దృష్టిలో పెట్టుకుని కొరటాల మొదట్లో వ్రాసిన కథకు ఎన్నో మార్పులు జరిగాయి అంటున్నారు. ఇలా మార్పులు జరగడానికి ‘ఆచార్య’ ఫెయిల్యూర్ చూసిన తరువాత జూనియర్ లో ఏర్పడిన భయాలు అన్న టాక్ కొనసాగుతోంది.



తెలుస్తున్న సమాచారం మేరకు ఇప్పటికే ఈమూవీ కథను ఫైనల్ చేసిన కొరటాల ఈసినిమా ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు మ్యూజిక్ డైరెక్టర్ అనురుద్ లతో ఈసినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసే పనులలో బిజీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈమూవీ షూటింగ్ వచ్చేనెల మొదటి వారం నుండి ప్రారంభం అవుతుంది అన్న సంకేతాలు వస్తున్న నేపధ్యంలో ఈసినిమా షూటింగ్ కు సంబంధించి జూనియర్ కొరటాల కు మరో కండిషన్ పెట్టాడు అన్న గాసిప్పులు వినిపిస్తున్నాయి.



ఈసినిమాకు సంబంధించిన కథ ఫైనల్ అయినప్పటికీ ఈమూవీకి సంబంధించిన బౌండ్ స్క్రిప్ట్ ఇంకా కొరటాల తారక్ కు ఇవ్వలేదనీ అదేవిధంగా ఈమూవీ షెడ్యూల్స్ వివరాలు కూడ కొరటాల జూనియర్ కు ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో ఆరెండు తనకు ఇచ్చిన తరువాత ఈమూవీ ఫైనల్ షూటింగ్ మొదలుపెట్టమని జూనియర్ కొరటాల కు మరొక కండిషన్ పెట్టాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా కేవలం ఒకేఒక్క ఫెయిల్యూర్ తో కొరటాల కు ఇన్ని కష్టాలు ఏమిటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..






మరింత సమాచారం తెలుసుకోండి: