పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక షాకింగ్ న్యూస్ తెరమీదకు వచ్చింది. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత తాను ఇక సినిమాలకు గుడ్ బై చెబుతున్నానని రాజకీయాల్లోనే పూర్తిగా నిమగ్నం అవుతానని చెబుతూ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీతో పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు.అయితే వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలో జగన్ కనుక మంచిగా పాలన చేస్తే తాను మళ్ళీ వెనక్కి వెళ్లి సినిమాలు చేసుకుంటానని పవన్ ప్రకటించారు.ఇక  ఆ తర్వాత జగన్ పాలనను ఒకపక్క తూర్పారబడుతూనే మరో పక్క సినిమాలు కూడా చేసుకుంటూ వస్తున్నారు.

ఇక  అలా ఆయన హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయింది గానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం ఇబ్బంది పడింది.కాగా  భీమ్లా నాయక్ సినిమా ఇప్పటికే ప్రేక్షకులకు ముందుకు వచ్చి ఓ మాదిరి టాక్ తెచ్చుకుంది.ఇక ఇప్పుడు ఆయన హీరోగా దాదాపు మూడు సినిమాలు ప్రకటించారు. క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ డైరెక్షన్లో భవదీయుడు భగత్ సింగ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా, బండ్ల గణేష్ నిర్మాణంలో మరో సినిమా చేస్తానని మాట ఇచ్చారు.  ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ పూర్తిగా ఏపీ రాజకీయాల మీద దృష్టి పెట్టిన నేపథ్యంలో ఆయన హరిహర వీరమల్లు సినిమా ఒక్కటే పూర్తి చేస్తారని తెలుస్తోంది.

ఇక మిగిలిన రెండు సినిమాలను ఎన్నికల నేపథ్యంలో పక్కన పెడుతున్నారని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఈకె దర్శకుడు హరీష్ శంకర్ అలాగే సురేందర్ రెడ్డి లను వేరే సినిమాలు చేసుకోమని పవన్ టీమ్ నుంచి సందేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది . అయితే ఈ నేపద్యంలో హరీష్ శంకర్ సల్మాన్ ఖాన్ తో సినిమా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.ఇదిలావుంటే గత కొన్నాళ్లుగా ముంబైలోని మకాం వేసిన ఆయన సల్మాన్ ఖాన్ డేట్స్ ఇచ్చిన తర్వాతే తిరిగి హైదరాబాద్ వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఇప్పుడు బాలీవుడ్ కంటే టాలీవుడ్ సేఫ్ అని భావిస్తున్న బాలీవుడ్ స్టార్లు మన తెలుగు సినిమాల్లో అతిథి పాత్రలైనా చేయడానికి వెనకాడటం లేదు.అయితే  అలాంటిది ఒక సూపర్ హిట్ తెలుగు డైరెక్టర్ తన డైరెక్టు చేస్తానంటే సల్మాన్ ఖాన్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. అయితే ఒకవేళ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కితే దాన్ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే అవకాశం ఉంది. ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందనేది చూడాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: