పొడుగు కాళ్ళ సుందరి ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జాతి రత్నాలు మూవీ తో అద్భుతమైన విజయాన్ని అద్భుతమైన క్రేజ్ ను ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. జాతి రత్నాలు మూవీ లో చిట్టి పాత్రలో నటించిన  ఫరియా అబ్దుల్లా తన పాత్రతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఆ తర్వాత ఈ పొడుగు కాళ్ళ సుందరి బంగార్రాజు మూవీ లో ఐటమ్ సాంగ్ లో నటించింది. 

ఈ ఐటెం సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం  ఫరియా అబ్దుల్లా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కుతున్న రావణాసుర అనే మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఇలా వరస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న పొడుగు కాళ్ళ సుందరి ఫరియా అబ్దుల్లా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో కొన్ని ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఫరియా అబ్దుల్లా తన ఇన్స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ ముద్దు గుమ్మ గ్రీన్ కలర్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా కు సంబంధించిన ఈ గ్రీన్ కలర్ పొట్టి డ్రెస్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: