కన్నడ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుల లో ఒకరు అయినటు వంటి రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకం గా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన ఈ హీరో తాజాగా కాంతారా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కన్నడ భాషలో సెప్టెంబర్ 30 వ తేదీ న థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ రావడం తో ఈ మూవీ ని అక్టోబర్ 15 వ తేదీన తెలుగు భాషలో కూడా విడుదల చేశారు. ఈ మూవీ కి తెలుగు భాషలో కూడా అద్భుతమైన బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఈ మూవీ కి ఇప్పటికి కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే 30 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంతారా మూవీ సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం : 12.67 కోట్లు .
సీడెడ్ : 3.14 కోట్లు .
యు ఏ : 3.61 కోట్లు .
ఈస్ట్ : 2.08 కోట్లు .
వెస్ట్ : 1.30 కోట్లు .
గుంటూర్ : 1.71 కోట్లు .
కృష్ణ : 1.67 కోట్లు .
నెల్లూర్ : 97 లక్షలు .
30 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంతారా మూవీ 27.15 కోట్ల షేర్ , 51.15 గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇప్పటికి కూడా కాంతారా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది. ఇది ఇలా ఉంటే రిషబ్ శెట్టి "కాంతారా" మూవీ లో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ లో రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. కాంతారా మూవీ ని తెలుగు లో గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: