మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి హన్సిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హన్సిక , అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్  దర్శకత్వం లో తెరకెక్కిన దేశముదురు మూవీ తో హీరోయిన్ గా తన కెరీర్ ను మొదలు పెట్టింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఈ మూవీ లోని హన్సిక పాత్రకు కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించడంతో హన్సిక కు దేశముదురు మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన హన్సిక ఈ మధ్య కాలంలో ఎక్కువగా తమిళ మూవీ లోని నటిస్తూ వస్తుంది. ఈ ముద్దు గుమ్మ తెలుగు తో పాటు తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా ఎన్నో సంవత్సరాల పాటు మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది.

తెలుగు , తమిళ మూవీ ల ద్వారా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. హన్సిక తన ప్రియుడు సోహల్ కుతూరియాను త్వరలో పెళ్లి చేసుకోనుంది. జైపూర్ లో ఉన్న 450 ఏళ్ల చరిత్ర కలిగిన ప్యాలెస్ లో వీరిద్దరి వివాహం వేడుకలు జరగనున్నాయి. అయితే హన్సిక మ్యారేజ్ కు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హన్సిక వివాహ వేడుకలు ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో లైవ్ స్ట్రీమింగ్ కానున్నాయట. పెళ్లికి రెండు రోజుల ముందు మెహందీ మరియు సంగీత్ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే హన్సిక ప్రస్తుతం కూడా తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: