సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్తగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయన అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. తెలుగు తెరమీద ఆయన చేసిన ఎన్నో అద్భుతమైన చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఘట్టమనేని అభిమానులు సినీ ప్రియులంతా దిగ్బ్రాంతికి గురవుతున్నారు. గూడచారి, అల్లూరి సీతారామరాజు ఇలా ఎన్నో ప్రయోగాత్మకంగా సినిమాలలో నటించి దాదాపుగా నాలుగ దశాబ్దాలు పాటు తన సినీ కెరీర్ ని కొనసాగించారు కృష్ణ. ఇక కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి గత కొన్ని నెలల క్రితమే మరణించింది.


ఈ విషయం మరింత కృంగిపోయేలా చేసిందని చెప్పవచ్చు. దీంతో హార్ట్ ఎటాక్ కూడా  రావడంతో ఆదివారం రోజున నమ్రత, కృష్ణ ను హాస్పిటల్ లో జాయిన్ చేయించింది. డాక్టర్లు ఎంత కష్టపడినా సరే కృష్ణ ని కాపాడలేకపోయారు. ఇక ఈరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు తుది శ్వాస విడిచారు కృష్ణ. బుర్రె పాలెం లాంటి చిన్న ఊరు నుంచి మద్రాస్ కు చేరుకొని సూపర్ స్టార్ గా ఎదిగిన కృష్ణ సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినప్పటికీ కేవలం తన స్వయంకృషితోనే తెలుగు సుదీప్ చరిత్రలోనే తనకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలను సంపాదించారు కృష్ణ.

ఇక అభిమానుల సైతం తమ నటుడి మరణ వార్తను విన్న తర్వాత కృష్ణ పార్థివ దేహాన్ని చూసేందుకు ఆయన అభిమానులు అక్కడికి బయలుదేరారు. తెలుగు రాష్ట్రాల నుంచి కృష్ణ చివరి చూపు కోసం ఎంతో మంది అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందువలన ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇక గురువారం రోజున కృష్ణ  పార్థివ దేహాన్ని అంత్యక్రియలు జరపనున్నారు.. పంజాగుట్ట లోని మహాప్రస్థానంలో ఈ అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు సమాచారం. రేపటి రోజు అంత్యక్రియలు జరగాల్సి ఉండగా అష్టమి కారణం చేత ఎల్లుండి అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: