నందమూరి నట సింహం బాలకృష్ణ తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లను మిస్ చేసుకున్నాడు. అలా బాలకృష్ణ తన కెరీర్ లో ఇప్పటి వరకు మిస్ చేసుకున్న బ్లాక్ బాస్టర్ మూవీ లు ఏవో తెలుసుకుందాం.

మాస్ మహారాజ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కిన క్రాక్ మూవీ ఏ రేంజ్ విజయం అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కథను మొదట గా గోపీచంద్ మలినేని బాలకృష్ణ కు వినిపించాడట ,  కాక పోతే కొన్ని అనివార్య కారణాల వల్ల బాలకృష్ణమూవీ లో నటించ లేక పోయినట్లు తెలుస్తోంది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సింహాద్రి మూవీ ఏ రేంజ్ విజయం అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కథను ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ , బాలకృష్ణ కోసం తయారు చేశాడు.  కానీ ఈ మూవీ కథకు బాలకృష్ణ నో చెప్పడంతో రాజమౌళిమూవీ ని జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించాడు.


విక్టరీ వెంకటేష్ కెరియర్ లో అద్భుతమైన విజయంత మైన మూవీ లలో ఒకటి అయిన సూర్యవంశం మూవీ కథ ను కూడా మొదట గా బాలకృష్ణ కు వినిపించగా , పెద్దన్నయ్య మూవీ కథను పోలి ఉన్నది అనే కారణంతో బాలకృష్ణమూవీ ని రిజెక్ట్ చేశాడంట. రాజశేఖర్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ మూవీ లలో ఒకటి అయిన సింహరాశి కథను కూడా మొదట గా బాలకృ ష్ణకు వినిపించారట , కాగా కొన్ని కారణాల వల్ల బాలకృష్ణమూవీ లో నటించ లేక పోయినట్లు తెలుస్తోంది. ఇలా బాలకృష్ణ తన కెరియర్ లో కొన్ని బ్లాక్ బాస్టర్ మూవీ లను వదులుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: