నయనతార తరువాత ఎక్కువగా కోలీవుడ్ మీడియాలో సంచలన వార్తలకు చిరునామాగా ఉండే హీరోయిన్స్ లిస్టులో హన్సిక మొదటివరసలో ఉంటుంది. టాలీవుడ్ లో కూడ ఈమె అనేకమంది టాప్ హీరోల సినిమాలలో నటించింది. తమిళ హీరో శింభు తో ప్రేమ వ్యవహారం నడిపి అతడితో పెళ్ళి వరకు వెళ్ళిన హన్సిక ఆ తరువాత అతడితో బ్రేకప్ చేసుకుని మళ్ళీ సినిమాల వైపు మళ్ళింది.


అయితే యంగ్ హీరోయిన్స్ తాకిడి పెరిగి పోవడంతో హన్సిక కు అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో మళ్ళీ ఆమె మనసు పెళ్ళి పై మళ్ళి ఎట్టకేలకు తన భర్తను ఎంచుకుంది. ఇక్కడే ఆమెకు ఒక సమస్య ఎదురైంది. ఆమె సోహెల్ అనే ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లాడబోతోంది. అయితే అతడికి గతంలోనే మరొకరితో పెళ్ళి జరిగింది.


ఆ పెళ్ళికి హన్సిక గతంలో సోహెల్ పెళ్ళికి అతిధిగా వెళ్ళింది. అయితే కొన్ని కారణాలు వల్ల ఆ పెళ్ళి విడాకుల వరకు వెళ్ళడంతో ఆ సోహెల్ నే హన్సిక పెళ్లాడుతోంది. ఇప్పుడు ఈ విషయాన్ని తమిళ హీరో శింభు ఫ్యాన్స్ బయటపెట్టి ఆమె పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఒకప్పుడు శింభు ని పెళ్ళాడుతానని చెప్పి ఆఖరి నిముషంలో హ్యాండ్ ఇచ్చిన హన్సిక పై శింభు ఫ్యాన్స్ మరొక విధంగా ప్రతీకారం తీర్చుకుంటున్నారు అనుకోవాలి.


ఇది ఇలా ఉంటే హన్సిక డిసెంబర్ 4న రాజస్థాన్ లో ఒక ప్యాలెస్ లో ఘనంగా తన పెళ్ళి చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంది. కోట్లు ఖర్చుపెట్టి ఘనంగా పెళ్ళి చేసుకుంటున్న ఈమె పెళ్ళి తంతును అందరూ చూసే విధంగా నెట్ ఫ్లిక్స్ కు భారీ మొత్తానికి తన పెళ్ళి రైట్స్ అమ్మేసినట్లు వార్తలు వస్తున్నాయి. టాప్ హీరోయిన్స్ తమ పెళ్ళి వీడియోలను మార్కెట్ చేసుకుని కోట్లు సంపాదిస్తూ ఆ విషయంలో కూడ తమ వ్యాపార దృష్టిని కనపరుస్తూ ఎంతమంది విమర్శిస్తున్నా పట్టించుకోవడంలేదు..







మరింత సమాచారం తెలుసుకోండి: