కన్నడ సినిమా ఇండస్ట్రీ లో మంచి నటుడి గా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రిషబ్ శెట్టి తాజాగా కాంతారా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రిషబ్ శెట్టి హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. కాంతారా మూవీ కన్నడ భాషలో సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి కన్నడ భాషలో ప్రేక్షకుల నుండి అద్భుతమైన ఆదరణ లభించింది.

అలాగే ఈ మూవీ కి కన్నడ భాషలో బ్లాక్ బాస్టర్ టాక్ రావడం , అద్భుతమైన కలెక్షన్ లు రావడంతో ఈ మూవీ ని తెలుగు భాషలో అక్టోబర్ 15 వ తేదీన విడుదల చేశారు. తెలుగు భాషలో కూడా ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్ లు ఇప్పటికి కూడా లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగు భాషలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశాడు. ఇప్పటికే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్మలను కంప్లీట్ చేసుకుని లాభాలను అందుకుంటుంది.

ఇది ఇలా ఉంటే కాంతారా మూవీ యూనిట్ ఈ మూవీ ని మరో భాషలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని తుళు భాషలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.  అందుకు సంబంధించిన పనులు ప్రస్తుతం ఫుల్  స్పీడ్ లో జరుగుతున్నట్లు  తెలుస్తుంది. తుళు భాషలో ఈ మూవీ ని డిసెంబర్ మొదటి వారంలో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీలో  రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: