PS 2 : ఇక అప్పుడేనా ?

PS 2 :  తమిళ సీనియర్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా తమిళ స్టార్ నటీనటులతో "పొన్నియిన్ సెల్వన్" మొదటి భాగం భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ నెలలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద చాలా పెద్ద విజయాన్ని సాధించింది.బాహుబలి సినిమాకి పోటీగా విడుదల అయిన ఈ సినిమా ఆ రేంజిలో విజయం సాధించకపోయినా తమిళనాడులో మాత్రం ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది.అక్కడ అయితే రికార్డుల వర్షం కురిపిస్తుంది.చోళులు, పాండ్యుల మధ్య జరిగిన అతిపెద్ద యుద్ధం బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్, జయం రవి, విక్రమ్, కార్తీ ఇంకా అలాగే త్రిష వంటి స్టార్లు ముఖ్యపాత్రలు పోషించారు.ఇక మొదటి భాగం భారీ హిట్ అవ్వడంతో ఈ సినిమాకి రెండవ భాగమైన "పొన్నియిన్ సెల్వన్: 2" మీద ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని తమిళ అభిమానులు ఇప్పటినుంచే ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


కోలీవుడ్లో "పొన్నియిన్ సెల్వన్ 1" బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 400 కోట్ల పైగా కలెక్షన్లను వసూలు చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల దాకా వసూళ్లు చేసింది.2022లో చాలా ఎక్కువ కలెక్షన్లు నమోదు చేసిన తమిళ సినిమాగా ఈ చిత్రం రికార్డును సృష్టించింది.ఇప్పటి వరకు ఇంత ఎక్కువ కలెక్షన్లు నమోదు చేసిన నాలుగవ సినిమాగా ఈ సినిమా పేరు తెచ్చుకుంది. ఇక దేశవ్యాప్తంగా చూసుకున్నట్లు అయితే ఈ సినిమా కలెక్షన్ల విషయంలో 15వ స్థానాన్ని సంపాదించింది. మరి "పొన్నియిన్ సెల్వన్ 2" సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తోందో చూడాలి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కాలంలో ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల అవుతున్నట్లు సమాచారం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: