ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాలు అన్నీ కూడా మిగతా షోలతో పోల్చి చూస్తే కాస్త ఎక్కువగానే రేటింగ్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి అని చెప్పాలి. జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ మాత్రమే కాదు శ్రీదేవి డ్రామా కంపెనీ  లాంటి కార్యక్రమాలు కూడా టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంటున్నాయి. అయితే ఇక జబర్దస్త్ సహా శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి కార్యక్రమంలో మూల స్తంభంగా కొనసాగుతూ ఇక కార్యక్రమాన్ని ముందుకు నడిపించేది ఎవరు అంటే ప్రతి ఒక్కరు చెప్పేస్తారు హైపర్ ఆది అని.


 జబర్దస్త్ లో టాప్ టీమ్ లీడర్ గా కొనసాగుతున్న హైపర్ ఆది ఇక తన స్క్రిప్ట్ రైటింగ్ తో మిగతా షోలకు కూడా ప్రాణం పోస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అంతేకాదు ఇక తనదైన పంచుల వర్షంతో ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్విస్తూ ఉన్నాడు హైపర్ ఆది. ఇకపోతే ఇలా అటు ఈటీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాలలో మూల స్తంభంగా కొనసాగుతున్న హైపర్ ఆది రెమ్యూనరేషన్ భారీగా ఉంటుంది అన్న చర్చ గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది. ఇక ఎంతోమంది హైపర్ ఆది రెమ్యూనరేషన్ పై కూడా తమ ఊహాగానాలను సోషల్ మీడియాలో రాసుకోవచ్చారు.


 అయితే హైపర్ ఆది రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది అని తెలుసుకోవడానికి బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడు ఆసక్తి చూపిస్తూనే ఉంటారు అని చెప్పాలి. ఇక ఇటీవల ఈ విషయంపై ఎవరో కాదు ఏకంగా స్వయంగా హైపర్ ఆది క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలో భాగంగా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలను స్క్రీన్ మీద చూపించగా అందుకు సెలబ్రిటీలు సమాధానం చెప్పారు. దీంతో హైపర్ ఆది రెమ్యూనరేషన్ ఎంత అని ప్రశ్నకు హైపర్ ఆది సమాధానం చెప్పాడు. కానీ అతని వాయిస్ మ్యూట్ చేశారు. దీంతో అతని సమాధానం తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: