సుడిగాలి సుదీర్.. ఈ పేరుకి తెలుగు బుల్లితెరపై ఎంతలా క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు వరకు బుల్లితెర హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఏకంగా ఒక స్టార్ హీరో రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇక సుడిగాలి సుదీర్ ఎక్కడ అయినా స్టేజి మీద కనిపించాడు అంటే చాలు బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడా అతని చూసి తెగ మురిసిపోతూ ఉంటారు. ఇక రష్మితో లవ్ ట్రాక్ కారణంగా మిగతా కమెడియన్స్ తో పోల్చి చూస్తేకాస్త ఎక్కువగానే పాపులారిటీ సంపాదించుకున్నాడు సుదీర్.


 ఇక జబర్దస్త్ లో టాప్ టీం లీడర్ గా కొనసాగుతున్న సుధీర్ ఊహించని విధంగా జబర్దస్త్ నుంచి తప్పుకొని స్టార్ మాలో యాంకర్ గా ప్రత్యక్షమయ్యాడు అన్న విషయం తెలిసిందే. మరోవైపు ఇక సినిమాల ద్వారా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వస్తూ ఉన్నాడు.. కానీ గత కొంతకాలం నుంచి మాత్రం ఎలాంటి షోలు లేకపోవడంతో కాళీ గానే ఉంటున్నాడు సుదీర్. ఇలాంటి సమయంలోనే మొన్నటికి మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇక ఆ తర్వాత ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో కూడా సుడిగాలి సుదీర్ కనిపించాడు. దీంతో సుధీర్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చేసాడని తమ నిరీక్షణకు తెరపడిందని అభిమానులు అందరూ కూడా భావించారు.


 ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో సుడిగాలి సుదీర్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ పొందేందుకు సిద్ధంగా ఉన్నామని అనుకున్నారు. కానీ అంతలోనే మళ్లీ ఫ్యాన్స్ కి నిరాశ ఎదురయింది. ఎందుకంటే గత వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్లో కనిపించిన సుధీర్ ఇక ఇటీవలే విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోలో మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో అభిమానులు షాక్ అవుతున్నారు. కేవలం గాలోడు సినిమా ప్రమోషన్స్ కోసమే సుదీర్ వచ్చాడా.. మేము అందరూ ఊహించినట్లుగా రీ ఎంట్రీ  ఇవ్వలేదా అంటూ నిరాశలో మునిగిపోతూ ఉన్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: