విక్టరీ వెంకటేష్ తన 75వ సినిమా గురించి ప్రకటన చేస్తాడు అనుకుంటే స్వతహాగా వెంకటేష్ లో ఉన్న ఆధ్యాత్మిక పిపాస ఈమధ్య మళ్ళీ బాగా పెరిగిపోవడంతో వెంకీ మళ్ళీ ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి తన సత్యాన్వేషణ కొనసాగింపు కై ఒక అజ్ఞాత ప్రదేశానికి వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఎన్నిరోజులు ఎక్కడికి అన్న విషయం అతడి కుటుంబ సభ్యులకు తప్ప మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడినట్లు వార్తలు వస్తున్నాయి.


సినిమా రంగంలో టాప్ హీరో స్థానాన్ని వెంకటేష్ పొందినప్పటికీ ఎప్పుడు ఆడంబర జీవితానికి వీలైనంత దూరంలో వెంకటేష్ ఉంటాడు. అంతేకాదు ఆధ్యాత్మిక పుస్తకాలను ముఖ్యంగా పాశ్చాత్య భాషలలోని వేదాంత పుస్తకాలను విపరీతంగా చదివే అలవాటు వెంకటేష్ కు బాగా ఉంది. వాస్తవానికి సినిమా రంగంలోకి రాక ముందునుంచి వెంకీకి వేదాంత పుస్తకాలు చదవడం బాగా అలవాటు అని అంటారు.


ఈ సంవత్సరం వెంకటేష్ నుండి విడుదలైన ‘ఎఫ్ 3’ ఊహించిన స్థాయిలో విజయవంతం కాకపోవడం కొద్దిరోజుల క్రితం విడుదలైన ‘ఓరి దేవుడో’ వెంకటేష్ కు ఊహించని షాక్ ఇచ్చింది అని అంటారు. దీనితో కొంతకాలం తన ఆధ్యాత్మిక పిపాసను కొనసాగించి తిరిగి మళ్ళీ సినిమాల వైపు రావాలని అన్న ఉద్దేశ్యంతో వెంకీ ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఎంచుకున్నట్లు టాక్.


ఈమధ్యకాలంలో వెంకటేష్ ను కలిసి చాలామంది యంగ్ డైరెక్టర్స్ తమ కథలను వినిపిస్తున్నప్పటికీ ఆ కథలలో ఏకథను సినిమాగా ఎంచుకోవాలో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వెంకటేష్ రానా లు కలిసి నటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమ్ కాబోతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ మూవీ కూడ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఆధ్యాత్మిక యాత్ర పూర్తి చేసుకుని రెట్టించిన ఉత్సాహంతో వెంకీ మళ్ళీ సినిమాలు చేయాలని అతడి అభిమానులు ఆశిస్తున్నారు..  




మరింత సమాచారం తెలుసుకోండి: