టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన ‘లైగర్’ డిజాస్టర్ కావడంతో తీవ్ర నిరాశకు గురైయ్యాడు ఈ రౌడీ బాయ్. అయితే అప్పటి నుంచి బయట కార్యక్రమాలకు, మీడియా ముందుకు రావడం తగ్గించేశాడు. ఇక ఇప్పుడిప్పుడే కొన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నాడు విజయ్. తాజాగా హైద్రాబాద్ లోని మాదాపూర్ పేస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ‘ చిన్నారుల్లో కాలేయ మార్పిడి’ పై జరిగిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.  ఇక ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ ఓ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. 

ఇక దాంతో నెటిజన్లు రౌడీ బాయ్ తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తూ.. యూ ఆర్ ది రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.అయితే మాదాపూర్ పేస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పిల్లల్లో కాలేయ మార్పిడిపై అవగాహన సదస్సు ను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రామానికి హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడాడు.కాగా  విజయ్ మాట్లాడుతూ..”డాక్టర్లు నాకు ఇప్పుడే చెప్పారు.. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన చాలా ఆపరేషన్స్ పబ్లిక్ డోనర్స్, ప్రభుత్వ డోనర్ షిప్ వల్ల జరిగినవే అని. ఇక ఇతరుల కోసం అవయవాలను దానం చేయడం చాలా గొప్ప విషయం.

దక్షిణాది దేశాల్లో ఆర్గాన్ డోనేషన్ అనే కల్చర్ చాలా తక్కువని డాక్టర్లు చెబుతున్నారు. అయితే మీ అందరు ముందు చెప్తున్నా నేను నా అవయవాలన్నింటిని దానం చేస్తున్నాను” అని విజయ్ దేవరకొండ ప్రకటించాడు.ఇక మనం చనిపోయిన తర్వాత మన బాడీ పార్ట్స్ ఎందుకూ పనికి రాకుండా పోకూడదు అని విజయ్ అన్నాడు.అంతేకాదు  మనం చనిపోయాక కూడా మన అవయవాలు వేరేవారికి ఉపయోగపడాలి అని విజయ్ పేర్కొన్నాడు. విజయ్ ఆర్గాన్ డొనేషన్ చేస్తున్నట్లు ప్రకటించడంపై అక్కడి డాక్టర్లు హర్షం వ్యక్తం చేశారు.ఇక విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పది అంటూ పొగిడారు.  అయితే ఈ కార్యక్రమంలో విజయ్ అక్కడి పిల్లలతో సరదా సరదాగా గడిపిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.  ఆర్గాన్ డొనేషన్ చేస్తున్నట్లు విజయ్ ప్రకటించడంతో అభిమానులు సంతోషడుతున్నారు.ఇక  సోషల్ మీడియా వేదికగా విజయ్ యూ ఆర్ ది రియల్ హీరో అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  విజయ్ ప్రస్తుతం ఖుషీ మూవీలో నటిస్తున్నాడు. విజయ్ కు జంటగా సమంత నటిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: