కన్నడ సినిమా కాంతారా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. మొదట కన్నడ భాషలో విడుదల అయిన ఈ మూవీ అక్కడి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకోవడంతో , ఈ మూవీ ని అక్టోబర్ 15 వ తేదీన తెలుగు భాషలో కూడా భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ కి టాలీవుడ్ లో కూడా అద్భుతమైన టాక్ రావడంతో , ఇప్పటికే ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. అలాగే ప్రస్తుతం కూడా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో రిషబ్ శెట్టి హీరోగా నటించాడు. రిషబ్ శెట్టి ఈ మూవీ లో హీరో గా నటించడం మాత్రమే కాకుండా , ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ ద్వారా రిషబ్ శెట్టి నటుడి గాను , దర్శకుడి గాను అద్భుతమైన క్రేజ్ ను పాన్ ఇండియా రేంజ్ లో సంపాదించుకున్నాడు. ఈ మూవీ లో రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ద్వారా సప్తమి గౌడ కు కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజీ లభించింది. ఇప్పటికి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న ఈ సినిమాకు అదిరిపోయే శాటిలైట్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

మూవీ సాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ వారు 4.5 కోట్ల కు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఒక డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్ లో సాటిలైట్ ఆఫర్ రావడం అనేది చాలా పెద్ద విషయం అని చెప్పవచ్చు. ఈ మూవీ ఇప్పటి వరకు "ఓ టి టి" లో కూడా స్ట్రీమింగ్ కావడం లేదు. ఈ మూవీ "ఓ టి టి" లో అయిన కొద్ది రోజులకు బుల్లి తెరపై ప్రసారం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: