మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి సమంత తాజాగా యశోద అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. లేడీ ఓరియంటెడ్ మూవీ గా రూపొందిన ఈ మూవీ కి హరి శంకర్ , హరీష్ నారాయణ్ దర్శకత్వం వహించగా , మెలోడీ బ్రహ్మ మణిశర్మమూవీ కి సంగీతం అందించాడు. ఉన్ని ముకుందన్ , వరలక్ష్మి శరత్ కుమార్ , రావు రమేష్ , మురళీ శర్మమూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం తో యశోద మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ యశోద సినిమా నవంబర్ 11 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది.

మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ టాక్ రావడం తో ప్రస్తుతం ఈ మూవీ కి  బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి మణిశర్మ అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్రను పోషిస్తుంది. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా పాటలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా విడుదల తర్వాత కూడా ఈ మూవీ పాటలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నుండి "బేబీ షవర్" వీడియో సాంగ్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. మరి ఈ వీడియో సాంగ్ లు ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: