కన్నడ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే రిషబ్ శెట్టి తాజాగా కాంతారా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ లో రిషబ్ శెట్టి హీరోగా నటించిన మాత్రమే కాకుండా , ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ లో రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది.

మూవీ ని మొదట కన్నడ భాషలో సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల చేశారు. ఆ తర్వాత తెలుగు లో అక్టోబర్ 15 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగు లో గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశాడు. ఇప్పటికే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతుంది. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని లాభాలను అందుకుంటుంది.

ఇది ఇలా ఉంటే కాంతారా మూవీ "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటు వంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు , ఈ మూవీ ని నవంబర్ 24 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు , ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే వెలువలనున్నట్లు తెలుస్తోంది  ఇది ఇలా ఉంటే ఈ మూవీ ద్వారా రిషబ్ శెట్టి కి పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: