కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన సినిమా కాంతార. ఈ సినిమాకి ఆయనే దర్శకత్వం వహించడం జరిగింది. ఇక తెలుగులో కూడా అనూహ్య విజయాన్నందుకున్న కాంతార సినిమా త్వరలోనే బుల్లితెర ప్రేక్షకుల్ని కూడా అలరించనుంది. ఇక ఈ సినిమా శాటిలైట్ డీల్ లాక్ అయింది. ప్రముఖ శాటిలైట్ ఛానెల్ స్టార్ మా, కాంతార సినిమా హక్కుల్ని దక్కించుకుంది.ఇక ఈ డబ్బింగ్ సినిమా హక్కులు తెలుగులో మొత్తం 4 కోట్ల 50 లక్షల రూపాయలకు అమ్ముడుపోయాయి.ఓ కన్నడ డబ్బింగ్ సినిమాకు తెలుగులో ఈ స్థాయిలో రేటు పలకడం నిజంగా చాలా పెద్ద విశేషం. కేజీఎఫ్ సినిమా తర్వాత శాటిలైట్ లో ఈ రేటు అందుకున్న కన్నడ డబ్బింగ్ సినిమా ఇదే. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను చాలా రోజుల కిందటే అమెజాన్ ప్రైమ్ కు అమ్మేయడం జరిగింది. టోటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ దక్కించుకోవడం జరిగింది.తెలుగు శాటిలైట్ రైట్స్ ను 7 కోట్ల రేషియోలో అమ్మాలని ఈ సినిమా నిర్మాతలు భావించారు.


కానీ అంత మొత్తం రాలేదు. చివరికి నాలుగున్నర కోట్లకు డీల్ ని వారు లాక్ చేశారు. ఇది కూడా చాలా పెద్ద మొత్తమే.కన్నడ డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తీసిన ఈ సినిమాను kgf సిరీస్ ని నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది. పాన్ ఇండియా సినిమాగా రిషబ్ శెట్టికి ఇదే తొలి భారీ విజయం. ఇక టాలీవుడ్ లో ఈ సినిమాను గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీపై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. ఈ సినిమాతో ఆయన పెట్టిన పెట్టుబడికి దాదాపు ఐదింతల లాభం అందుకున్నట్టు సమాచారం తెలుస్తుంది.తెలుగు, హిందీ భాషల్లో కలిపి 120 కోట్లకు పైగా ఈ సినిమా వసూళ్లు సాధించగా ఇక ప్రపంచవ్యాప్తంగా కాంతార సినిమాకి దాదాపు 400 కోట్లు వసూళ్లు వచ్చినట్టు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: