పందెంకోడి సినిమాతో తెలుగులో పరిచయమైన తమిళ హీరో విశాల్ తెలుగు కుర్రాడే అయినప్పటికీ ఆయన తమిళ హీరోగా మొదటి నుంచి సినిమాలు చేస్తూ వచ్చి అక్కడ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే పందెంకోడి సినిమా ఎప్పుడైతే తెలుగులో మంచి విజయాన్ని అందుకుందో అప్పటినుంచి ఆయన తన ప్రతి సినిమాను కూడా తెలుగులో విడుదల చేస్తూ వచ్చాడు. ఆ విధంగా మొదట్లో తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విశాల్ ఆ తరువాత అలాంటి విజయాలను అందుకోకపోవడంతో మార్కెట్ను కోల్పోయాడు అని చెప్పాలి.

ఇతర తమిళ హీరోలు మంచి మంచి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోగా ఈయన మాత్రం ప్రయోగాలు చేస్తూ వాటి ద్వారా నిరాశ పరుస్తూ ప్రేక్షకులను కలవరపరిచారు. ముఖ్యంగా ఆయన అభిమానులు ఆయన సినిమాల పట్ల ఎంతో నిరాశను కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాను మరొక సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ముందుకు వచ్చారు. లాటి అనే సినిమాను ఆయన ఇప్పుడు తెలుగులో విడుదల చేయబోతున్నారు.

ఈ చిత్రం తప్పకుండ ప్రేక్షకులను అలరిస్తుంది అని నమ్మకాన్ని ఆయన వ్యక్త పరుస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ ఈ సినిమా తప్పకుండా తనకు తెలుగులో మంచి గుర్తింపును తీసుకువస్తుంది అని కోల్పోయిన వైభవాన్ని తీసుకువస్తుంది అని చెప్పారు. మరి ఆయన కోరుకున్న విధంగా ఈ సినిమా హిట్ అందుకుంటుందా అనేది చూడాలి.  ఇకపోతే అయన తెలుగు లో డైరెక్ట్ సినిమా చేయడానికి కూడా రెడీ గా ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఓ సినిమా ను అయన డైరెక్ట్ తెలుగు లో చేశారు. అందులో అయన పోలీస్ ఆఫిసేర్ గా నటించగా ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు అయన తెలుగు సినిమా చేస్తే అయన కెరీర్ కు ఎన్థొహ్ ఉపయోగపడుతుంది అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: