టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకులుగా పేరున్న కొంతమంది దర్శకులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. వారు ఎన్నో ఆశలు పెట్టుకున్న మొదలు పెడుతున్న సినిమాలు మధ్యలోనే ఆగిపోవడం హీరోలను నమ్మకాన్ని ఏర్పరుచుకోకపోవడంతో ఆ సినిమాలు ముందుకు వెళ్ళలేకపోతున్నాయి. యువ దర్శకులు పెద్ద హీరోలను సైతం మెప్పించి సినిమాలను చేసుకుంటూ పోతుంటే ఈ అగ్ర దర్శకులుగా ఉన్నవారు మాత్రం ఎందుకు ముందుకు వెళ్లడం లేదు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వారి కెరియర్లో పరుస విజయాలను అందిస్తున్న వీరి పట్ల ఎందుకు హీరోలకు నమ్మకం కుదరటం లేదో అర్థం కావడం లేదు. కొరటాల శివ త్రివిక్రమ్ వంటి దర్శకులకు ఏ స్థాయిలో విజయాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. తెలుగులో ఇప్పటికీ కొన్ని చెరిగిపోని రికార్డులను సృష్టించిన ఇద్దరు దర్శకుల సినిమాలకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలా ఆ పెద్ద దర్శకుల ఇబ్బందులు ఇప్పుడు చూద్దాం. 

కథ విషయంలో ఎన్టీఆర్ ఏమాత్రం ఒప్పుకోకపోవడంతో కొరటాల శివ సినిమా ముందుకు వెళ్లడం లేదు. గత కొన్ని రోజులుగా ఇది ఓ పెద్ద సమస్య గా మారింది. ఇప్పుడు కొరటాల ఓ కొత్త కథ తో ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడట. ఇదే సమస్య త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా విషయంలో కూడా జరుగుతుంది. ఈ సినిమా యొక్క కథ విషయంలో మహేష్ బాబు 50% సంతృప్తిగా ఉండడం త్రివిక్రమ్ సినిమా ముందుకు వెళ్లకపోవడానికి కారణం అవుతుంది. తొందరలోనే దీనికి సంబంధించిన ఓ క్లారిటీ రాబోతుంది. ఆ విధంగా ఈ ఇద్దరు అగ్ర దర్శకుడు తమ సినిమాలతో ఇబ్బందులు పడుతున్నారు. మీరు మాత్రమే కాకుండా కొంతమంది అగ్ర దర్శకులు హీరోలను ఒప్పించే విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ విధంగా జరిగితే అగ్ర హీరోలకు ఇబ్బందులు తప్పవనే చెప్పాలి. ఎక్కడ మిస్ అవుతున్నారో చెక్ చేసుకుని సినిమాలు వారు మొదలు పెడితే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: