మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించే దర్శకుడైన బోయపాటి శ్రీను అఖండ చిత్రంతో సంచలన విజయాన్ని అందుకొని ఆ విజయాన్ని ఇంకా ఆస్వాదిస్తూనే ఉన్నాడని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమాకు సంబంధించిన పనులను చేస్తున్నాడు. టాలీవుడ్ యువ హీరో రామ్ పోతినేని తో కలిసి ఈ దర్శకుడు ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఇంకా మొదలు కాకపోవడం సినిమా అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది.

వరుస ప్లాపులతో సతమతమవుతున్న రామ్ పోతినేని తప్పకుండా ఈ సారి విజయం సాధించాల్సిన నేపథ్యంలో ఈ దర్శకుడు తో సినిమా చేస్తే అది సాధ్యపడుతుంది అని అందరూ భావిస్తూ ఉండగా ఈ సినిమా ఇంకా మొదలు కాకపోవడం వారిలో ఎంతో నిరుత్సాహానికి గురి చేస్తుంది. స్క్రిప్ట్ పనులు ఆలస్యం అవుతున్న కారణంగానే ఈ సినిమా ఇంకా మొదలు కావడం లేదు అన్నది తెలుస్తుంది. ఏదేమైనా వీరిద్దరి కలయికలో రాబోతున్న సినిమా తప్పకుండా మంచి విజయం అందుకుంటుంది అని చెప్పవచ్చు.

ఇంకా పూర్తి వివరాలు ఈ సినిమాకు సంబంధించి బయటకు రాలేదు సినిమా మొదలయ్యే నాటికి అన్ని వివరాలు చెప్పబోతున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను అల్లు అర్జున్ హీరోగా సినిమా చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సినిమాను ఆయన ఎప్పుడు పూర్తి చేస్తాడో చూడాలి.ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమా తో హిట్ అందుకున్న రామ్ ఆ తర్వాత ఆ విజయాలను కంటిన్యూ చేయలేకపోయాడని చెప్పాలి. రెడ్ మరియు ఇటీవలే విడుదల అయిన వారియర్ సినిమాలు ప్రేక్షకులను ఏవిధంగా నూ మెప్పించలేకపోయింది. దాన్థొహ్ ఈ సినిమా హిట్ అవ్వాలని రామ్ అభిమానులు కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: