కన్నడ స్టార్  హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన రీసెంట్ మూవీ 'కాంతార' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి కూడా తెలిసిందే.ఈ సినిమాను కన్నడతో పాటు ఇతర భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయగా, ఎవరి అంచనాలకు కూడా అందని విధంగా ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే హిట్ దక్కించుకుంది. ఇక ఈ సినిమాను రిషబ్ శెట్టి స్వయంగా డైరెక్ట్ చేసిన విధానం కూడా చాలా సూపర్బ్ అంటూ ప్రేక్షకులు ఆయన్న పొగడ్తలతో బాగా ముంచెత్తుతున్నారు.సినిమాకు అన్ని వర్గాలు ప్రేక్షకులు కూడా కనెక్ట్ కావడంతో ఈ సినిమాను చూసేందుకు జనాలు విపరీతంగా థియేటర్లు క్యూ కట్టారు. ఇక ఈ సినిమాను గత నెలలోనే ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తుండటంతో ఈ సినిమాను ఓటీటీలో అప్పుడే రిలీజ్ చేయొద్దంటూ ఓటీటీ నిర్వాహకులను చిత్ర నిర్మాతలు ఎంతగానో రిక్వెస్ట్ చేశారు.


అయితే తాజాగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు రెడీ అవుతోంది.ఈ సినిమాను నవంబర్ 24 వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీగా ఉన్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. ఇక సౌత్ భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు ఓటీటీ నిర్వాహకులు ఇప్పుడు సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా, అంజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ ని అందించారు.ప్రపంచవ్యాప్తంగా కూడా కాంతార సినిమా ఏకంగా 400 కోట్ల దాకా వసూళ్లు నమోదు చేసింది. ఇక కన్నడ ఇండస్ట్రీలో ఈ సినిమా ఏకంగా కేజీఎఫ్ రికార్డులు బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.పాన్ ఇండియా భాషల్లో కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ దక్కించుకొని సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: