ఇటీవల కాలంలో కొంతమంది యువ హీరోలు పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ఉండడం జరుగు తుంది. అయితే వారికి తెలుగులో సరైన హిట్ లేనప్పుడు కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడం కొంతమందిని ఆశ్చర్యం కలిగిస్తుంది. తాజాగా ఓరి దేవుడా సినిమాతో మోస్త రు విజయాన్ని అందుకున్న హీరో విశ్వక్సేన్ ఇప్పటివరకు తెలుగులో ఒకసారి కూడా భారీ విజయాన్ని అందుకుంది లేదనే చెప్పాలి.  ఫలక్ నుమా దాస్ సినిమా తోనే హీరో పర్వాలేద నిపించుకోగా అంతకుముందు చేసిన ఈ నగరానికి ఏమైంది సినిమా క్రెడిట్ ఈయన ఒక్కడి ఖాతాలోకి వెళ్ళదు

కాబట్టి ఈ రెండు సినిమాలు కూడా ఆయనకు యావరేజ్ విజయాలనే తీసుకువచ్చాయని చెప్పా లి. ఆ తర్వాత చేసిన హిట్ సినిమా పర్వాలేదు అనిపించుకునే హిట్ అందుకోగా ఇప్పుడు వరుస ప్లాపులతో ఈ హీరో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన దమ్కీ అనే ఓ సినిమాను స్వీయ దర్శకత్వంలో చేస్తూ ఉండగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ వా విడుదల చేయాలనుకోవడం కొంతమందిని ఆశ్చర్యం కలిగిస్తుంది.

వాస్తవానికి ఒక మంచి విజయం అందుకున్న తర్వాత ఇక్కడ పూర్తిస్థాయిలో గుర్తింపు వచ్చిన తర్వా త ఆయన ఈ పాన్ ఇండియా సినిమాల జోలికి వెళితే మంచిది అని కొంతమంది చెబుతున్నారు. ఏదైనా విశ్వ క్ ఈ సినిమాను ఎలా చేస్తాడో చూడాలి. ఇక ఇటీవల ఆయన హీరో అ ర్జున్ తో కలిసి చేయవలసిన సినిమాను క్యాన్సల్ చేశారు. పలు ఇష్యుల కారణంగా ఈ సినిమా నుండి విశ్వక్ ను తీసేయవలసి వచ్చింది అని అర్జున్ వెల్లడించారు. ఏదేమైనా తన ప్రతి సినిమాకు కోరి ఓ కాంట్రవర్సీని తెచ్చుకుంటున్న విశ్వక్ ఇప్పుడు తన తదుపరి సినిమాల ద్వారా ఎలా ప్రేక్షకులను ఎలా అలరించ గలుగుతారు అనేదే అసలు విషయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: