తెలుగు సినీ ఇండస్ట్రీలో ధర్మచక్రం వంటి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ప్రేమ. అటు తర్వాత దేవీ చిత్రంతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. అయితే ఈమె నటించింది తక్కువ సినిమాలే అయినా అందులో మంచి సినిమాలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. కానీ ఈమె నటించిన చిరునవ్వుతో సినిమా కెరియర్ను పూర్తిగా మార్చేసింది.. అప్పటివరకు మంచి సినిమాలలో నటిస్తున్న ప్రేమకు త్రివిక్రమ్ చిరునవ్వుతో సినిమా ఆఫర్ ఇవ్వడం జరిగిందట.  ఆ సినిమా కథ చెప్పిన సమయంలో చిరునవ్వుతో సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర అని తెలియజేశారట.


కానీ తీరా చూస్తే విడుదలయ్యాక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కాదు అదొక నెగిటివ్ పాత్ర అని తెలియజేసింది. అంతేకాకుండా ఆ పాత్ర వల్ల ప్రేమకి కూడా చాలా ఇమేజ్ డ్యామేజ్ అయిందని తెలియజేసింది. కానీ చిరునవ్వుతో సినిమా తర్వాత మీ కెరియర్ అద్భుతంగా ఉంటుంది అని త్రివిక్రమ్ చెప్పినట్లుగా ఆమె తెలియజేసింది. కానీ కథలో తన పాత్ర మరొక విధంగా చెప్పి.. చిత్రీకరించే సమయంలో మరొక రకంగా చిత్రీకరించారని దీంతో తనని త్రివిక్రమ్ మోసం చేశారని ఆమె తెలియజేస్తోంది.
చిరునవ్వుతో సినిమాకు రచయితగా త్రివిక్రమ్ వ్యవహరించారు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ తన కెరీర్ మాత్రం పూర్తిగా నాశనం అయ్యింది అని తెలియజేస్తోంది ప్రేమ. అప్పటినుంచి వచ్చే అవకాశం.. పోయే అవకాశం ఉన్నట్లుగా తమ సినీ వ్యవహారం ఉందని తెలుపుతోంది. ఈ మధ్య రీఎంట్రీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన పెద్దగా నచ్చే పాత్రలు రాలేదని తెలియజేస్తోంది. మరి ఎంతో చక్కటి అందం,  అభినయం ఉన్న ప్రేమ సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలాంటి పాత్ర చేస్తుందా? అంటూ అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. తన కెరియర్ నాశనం అవ్వడానికి కారణం మాత్రం త్రివిక్రమే అంటూ మరొకసారి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కచ్చితంగా తన మనసుకు నచ్చే పాత్ర వస్తే రియంట్రీ ఇస్తానని గట్టిగానే చెప్పింది ప్రేమ.

మరింత సమాచారం తెలుసుకోండి: