సోనూసూద్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. కరోనా ఆపత్కాలంలో అడిగిందే తడవుగా ఎంతోమందికి ఆపన్న హస్తం అందించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫౌండేషన్ ఆధ్వర్యం లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు సోనూసూద్. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తూ వారి జీవితాలకు బాసటగా నిలుస్తున్నాడు.


తాజాగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోన్న దివ్యాంగుడైన సింగర్కు సాయం చేసేందుకు ముందుకొచ్చాడు సోనూసూద్. ఓ ప్రైవేటు స్కూల్లో ఉద్యోగం కల్పిస్తానని భరోసా ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే ఝార్ఖండ్కు చెందిన మక్సూద్ అనే దివ్యాంగుడు సంగీతం లో మంచి ప్రావీణ్యం ఉంది. 2017 ఇండియన్ ఐడల్ సింగర్ పోటీల్లో కూడా పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం తన పరిస్థితి బాగోలేక బొకారో జిల్లాలో రోడ్ల వెంట భిక్షాటన చేస్తున్నాడు. తన గాత్రాన్ని ప్రజలకు వినిపిస్తూ సాయం చేయాలని ప్రజలను దీనంగా అడుక్కుంటున్నాడు. దీంతో అతడి గురించి సోషల్ మీడియా లో పలు కథనాలు వచ్చాయి. అది కాస్త అందరి మనసును కరిగించింది..


కాగా మక్సూద్ గురించి తెలుసుకున్న సోనూసూద్ అతనికి ఓ ప్రైవేటు స్కూల్లో ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చాడు. ఆ రాష్ట్ర మంత్రి కూడా మక్సూద్కు ప్రభుత్వ సాయం అందిలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు. 'సోనూసూద్ నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది నిజమే. సంగీతం తో కలిసి సాగడమే నా కల. మళ్లీ ఇండియన్ ఐడల్ సింగర్ పోటీల్లో పాల్గొనాలని ఉంది. నా గొంతుకు గుర్తింపుగా పురస్కారాలు అందుఓవాలని ఉంది. కరోనా కారణంగా నా జీవితం తలకిందులైంది. ప్రస్తుతం ఉదయం బొకారో నగరానికి వచ్చి విధుల్లో భిక్షాటన చేస్తూ సాయంత్రం ఇంటికి వెళుతున్నాను. సోనూసూద్ సార్ సాయం తో మళ్లీ నా కల నెరవేరుతుందని భావిస్తున్నా' అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నాడు మక్సూద్..ఈ వార్త వైరల్ అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: