టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏం మాయ చేసావే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో నటించి తన నటన తో అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా చాలా సంవత్సరాల నుండి కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే సమంత కేవలం తెలుగు భాష సినిమాలలో మాత్రమే కాకుండా తమిళ భాష సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది.

అలాగే ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో కూడా కీలక పాత్రలో నటించి హిందీ ప్రేక్షకులను కూడా సమంత అలరించింది. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత "యశోద" అనే లేడీ ఓరియంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ నవంబర్ 11 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి పాజిటివ్ టాక్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా యశోద మూవీ కి డీసెంట్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా లభిస్తున్నాయి. ఇలా యశోద మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపింది.

సోషల్ మీడియా వేదికగా సమంత స్పందిస్తూ ... మీ ప్రశంసలు మద్దతు నాకు లభించిన గొప్ప బహుమతి. మూవీ ని ప్రదర్శిస్తున్న థియేటర్ లలో మీ సంబరాలు చూసా. మూవీ పై మీరు చెప్పిన మాటలు విన్న. దీని వెనక మా మూవీ యూనిట్ కష్టం కనిపిస్తుంది. ఇప్పుడు నా మనసు గాల్లో తేలినట్టుగా ఉంది. యశోద మూవీ లో భాగస్వామ్యం అయిన వారందరికీ థాంక్స్ అని సమంత సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: