ఈ మధ్య కాలంలో ఇతర భాష నుండి తెలుగు లోకి డబ్ అయ్యి తెలుగు లో ఘన విజయం సాధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగా తాజాగా తమిళం లో విడుదల అయ్యి బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తున్న లవ్ టుడే మూవీ ని కూడా తెలుగు లో విడుదల చేయనున్నారు. లైవ్ టుడే మూవీ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటు వంటి దిల్ రాజు విడుదల చేయబోతున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ తెలుగు ట్రైలర్ ను కూడా మూవీ యూనిట్ విడుదల చేసింది.

లవ్ టుడే మూవీ ట్రైలర్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. దానితో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తమిళం లో నవంబర్ 4 వ తేదీన విడుదల అయ్యి  బ్లాక్ బస్టర్ విజయం సాధించిన లవ్ టుడే మూవీ.ని తెలుగు లో నవంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రదీప్‌ రంగనాథన్‌ హీరో గా నటించాడు. ఈ మూవీ లో ప్రదీప్ రంగనాథన్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. మరి ఇప్పటికే తమిళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న లవ్ టుడే సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: