కెరియర్ ప్రారంభంలో కామెడీ సినిమాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ ఎన్నో కామెడీ మూవీ లలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన అల్లరి నరేష్ ఆ తర్వాత కామెడీ మూవీ లతో పాటు తన పాత్రకు అత్యంత ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన మూవీ లలో కూడా నటించి తన నటన తో అల్లరి నరేష్ ఎంతో మంది ప్రేక్షకులను అలరించాడు. ఇలా అల్లరి నరేష్ ఇప్పటికే ఎన్నో సినిమా లలో కామెడీ పాత్రలలో నటించడం మాత్రమే కాకుండా తన నాటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలలో కూడా నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అల్లరి నరేష్ "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో ఆనంది హీరోయిన్ గా నటించగా , ఏఆర్ మోహన్మూవీ కి దర్శకత్వం వహించాడు. నవంబర్ 25 వ తేదీన ఈ మూవీ ని థియేటర్ లలో విడుదల చేయనున్నారు. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. దానితో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా నుండి "కోలో కోలో కోయిల" అనే సాంగ్ ను నవంబర్ 19 వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ తో అల్లరి నరేష్ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: