నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు యూత్ కు బాగా వినిపిస్తోంది..అందం,అభినయంతో పాటు ఆమె మాటలు కూడా సినిమాకు ప్లస్ అయ్యింది..వరుస హిట్ సినిమాలలో నటిస్తూ బాగా బిజీగా ఉంది..ఇప్పటికే నేషనల్ క్రష్ అయ్యింది.కేవలం తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ లు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్ సంపాదించుకుంటుంది. ఇక ఈ అమ్మడు తెలుగు రీసెంట్ గా చేసిన పుష్ప ఏ రేంజ్ లో హిట్ అయ్యింది అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ కు సుకుమార్ దర్శకత్వం వహించారు. ఇక ఇప్పుడు పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్నారు సుకుమార్ అండ్ టీమ్. పార్ట్ వన్ కంటే పుష్ప 2లో రష్మిక రోల్ ఎక్కువ ఉంటుందని టాక్.


ఇదిలా ఉంటే అటు బాలీవుడ్ లోనూ వరుస అవకాశాలు అందుకుంటుంది. అలాగే తమిళ్ లో దళపతి విజయ్ నటిస్తున్న వారసుడు లో హీరోయిన్ గా చేస్తుంది రష్మిక. తాజాగా ఈ అమ్మడు ఫిట్ నెస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. లతో ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది రష్మిక. తనకు సంబంధించిన ఏ విషయానైనా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది రష్మిక. తాజాగా ఫిట్నెస్ గురించి ఫిలాసఫీలు చెబుతూ వర్కౌట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను అభిమానులకు తెలిపింది ఈ నేషనల్ క్రష్.


తాను ఎలాంటి మూడ్ లో ఉన్న జిమ్ లో వర్కౌట్స్ చేయడం వల్ల సంతోషం కలుగుతుందని అంటుంది రష్మిక. తాను కోపంలో ఉన్న బాధలో ఉన్న సరే వర్కౌట్స్ మాత్రం తప్పకుండా చేస్తానని ఇలా వర్కౌట్ చేయడం వల్ల ఆ బాధ నుంచి తొందరగా బయటపడతానని తెలియజేశారు. ఇలా వర్కౌట్స్ చేయడం వల్ల ఫిట్ గా ఉండటమే కాదు మనసు కూడా హాయిగా వుంటుందని అమ్మడు చెప్థుంది..మీరు కూడా ఇలా చెయ్యండి అంటూ ఉచిత సలహాలు ఇచ్చింది.అందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: