టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటుbవంటి సమంత గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ చైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఏం మాయ చేసావే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఆ తర్వాత వరుస అవకాశాలను టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకొని అతి తక్కువ కాలంలోనే సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ల స్థానానికి ఎదిగిపోయింది. ఇప్పటికి కూడా సమంత వరుస సినిమా అవకాశాలను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంటూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.

సమంత తెలుగు తో పాటు అనేక తమిళ మూవీ లలో కూడా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత "యశోద" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ నవంబర్ 11 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటివరకు ఈ మూవీ 8 రోజుల బాక్స ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది.

ఈ 8 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
నైజాం : 3.52 కోట్లు .
సీడెడ్ : 65 లక్షలు .
యు ఏ : 87 లక్షలు .
ఈస్ట్ : 41 లక్షలు .
వెస్ట్ : 25 లక్షలు .
గుంటూర్ : 45 లక్షలు .
కృష్ణ : 48 లక్షలు .
నెల్లూర్ : 21 లక్షలు .
8 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో యశోద మూవీ 6.84 కోట్ల షేర్ , 12.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది.
తమిళ్ :  95 లక్షలు .
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 1.10 కోట్లు .
ఓవర్ సీస్ లో :  2.45 కోట్లు .
8 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా యశోద మూవీ 11.34 కోట్ల షేర్ , 24.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి హరి శంకర్ , హరీష్ నారాయణ్ దర్శకత్వం వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: