ఇటీవల నవంబర్ 15వ తేదీన తెలుగు చలనచిత్ర దిగ్గజం సూపర్ స్టార్ హీరో కృష్ణ స్వర్గస్తులైన విషయం తెలిసిందే. గత ఆదివారం హార్ట్ ఎటాక్ రావడంతో హుటాహుటిన హైదరాబాదులోని కాంటినెంటల్ హాస్పత్రికి తరలించగా.. ఒకరోజు చికిత్స అనంతరం మంగళవారం రోజు తెల్లవారుజామున 4:07 గంటల సమయంలో ప్రధాన అవయవాల పనితీరు ఆగిపోవడంతో సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. అంతేకాదు చికిత్సకు ఆయన శరీరం సహకరించకపోవడం వల్లే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త తెలుసుకొని అటు రెండు తెలుగు రాష్ట్రాలు.. ఇటు అభిమానులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతికి గురి అయ్యారు.


నానక్ రామ్ గూడా లో ఉన్న కృష్ణ నివాసానికి కృష్ణ పార్థివ దేహాన్ని తరలించి... అక్కడ ప్రముఖుల   సందర్శనార్థం పార్థివ దేహాన్ని ఉంచారు. అనంతరం మరుసటి రోజు పద్మాలయ స్టూడియోలో అభిమానుల సందర్శనార్థం కృష్ణ పార్థివ దేహాన్ని ఉంచి.. అటు తర్వాత మహాప్రస్థానానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇక గత రెండు రోజుల క్రితం కృష్ణ చిన్న కర్మ కార్యక్రమాన్ని  కుటుంబ సభ్యుల మధ్య ప్రముఖుల మధ్య పూర్తి చేయడం జరిగింది. ఇకపోతే కృష్ణ 11వ రోజు పెద్దకర్మ కార్యక్రమాన్ని ఆయన పుట్టిన ఊరు బుర్రిపాలెం లో నిర్వహిస్తారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి.

ఇందుకు కారణం కృష్ణంరాజు మరణించినప్పుడు కూడా ఆయన పెద్దకర్మ కార్యక్రమాన్ని కృష్ణంరాజు తనయుడు రెబల్ స్టార్ ప్రభాస్ మొగల్తూరులో భారీ ఏర్పాట్ల మధ్య నిర్వహించిన విషయం తెలిసిందే.  అక్కడ సంస్మరణ సభ ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి భోజన ఏర్పాట్లు కూడా చేయించి.. మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు కూడా కృష్ణ అంత్యక్రియలను ఆయన జన్మించిన ఊరైన బుర్రిపాలెం లో చేస్తారని అనుకున్నారు . కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కృష్ణ పెద్దకర్మ కార్యక్రమాన్ని హైదరాబాదులోనే నిర్వహించనున్నట్లు.. ఈరోజు అందుకు సంబంధించిన వెన్యూ కూడా ప్రకటించనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: