పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం కూడా పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్" మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసింది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , క్రిష్ జాగర్లమూడి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఎం ఎం కీరవాణి ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి మ్యూజిక్ ని అందిస్తున్నాడు.  ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలమే అవుతున్న , మధ్యలో కొంత కాలం పాటు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ జరగకపోవడంతో ఇప్పటికి కూడా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ మూవీ షూటింగ్ వేగవంతంగా జరగకపోవడంతో హరి హర వీరమల్లు మూవీ వచ్చే సంవత్సరం మార్చి 30 వ తేదీన విడుదల కావడం కష్టమే అని కొన్ని వార్తలు బయటకు వచ్చాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మార్చి 30 వ తేదీనే ఈ మూవీ ని విడుదల చేయడానికి ఈ మూవీ యూనిట్ పక్కాగా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అలాగే అందుకు తగినట్టుగానే ఈ మూవీ షూటింగ్ ను కూడా ఈ మూవీ యూనిట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. హరి హర వీరమల్లు మూవీ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: