మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ , చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , బాబీమూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మాస్ మహారాజ రవితేజమూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. చిరంజీవి మరియు రవితేజ మధ్య ఈ మూవీ లో ఒక పాట మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజ పాత్ర ఈ మూవీ కే హైలైట్ గా నిలవనున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో రవితేజ 45 నిమిషాలు నిడివి గల పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 

మూవీ లో బాబీ సింహ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని 2023 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను కూడా మొదలు పెట్టింది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి టైటిల్ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆ టైటిల్ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా వాల్తేరు వీరయ్య మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మొదటి సాంగ్ విడుదల తేదీని మరియు సమయాన్ని ప్రకటించింది. వాల్తేరు వీరయ్య మూవీ నుండి మొదటి సాంగ్ ను 23 నవంబర్ 2022 వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: