ప్రముఖ నిర్మాతలు ఎలాంటి భారీ సినిమాలను తీస్తే ప్రేక్షకులు చూస్తారో తెలియక తికమకలు పడుతూ ఉంటే అల్లు అరవింద్ మాత్రం చక్కగా వెరైటీ సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ సూపర్ సక్సస్ ను అందుకుంటున్నారు. లేటెస్ట్ గా ఆయన నిర్మాణ సంస్థ నుండి వచ్చిన ‘కాంతార’ సూపర్ సక్సస్ కావడంతో ఇప్పుడు మరింత రెట్టించిన ఉత్సాహంతో వరుణ్ ధావన్ బాలీవుడ్ మూవీని ‘తోడేలు’ టైటిల్ తో తెలుగులో డబ్ చేసి ఈవారం విడుదల చేస్తున్నారు.


ఒక మనిషిని అనుకోకుండా తోడేలు కలిస్తే అతడికి తోడేలు లక్షణాలు ఏర్పడితే వచ్చే సమస్యలు చుట్టూ ఈసినిమా ఉంటుంది. ఈమధ్యనే జరిగిన ఈమూవీ ప్రీమియర్ ఫంక్షన్ లో అల్లు అరవింద్ డబ్బింగ్ సినిమాల పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ‘బాహుబలి’ తరువాత అన్ని సినిమాలు ఇండియన్ సినిమాలుగా మారిపోయాయని అందువల్ల డబ్బింగ్ సినిమాలు స్ట్రైట్ తెలుగు సినిమాలు అన్న తేడా పూర్తిగా పోయిందని ఇప్పుడు సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు విడుదలైనా తప్పులేదు అంటూ దిల్ రాజ్ సంక్రాంతి విడుదల చేయబోతున్న ‘వారసుడు’ సినిమాకు సపోర్ట్ గా మాట్లాడాడు.


ఒకవైపు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు విడుదల చేయకూడదు అంటూ ఒక బహిరంగ ప్రకటన ఇచ్చిన నేపధ్యంలో ఆ ప్రకటనను లెక్కచేయకుండా డబ్బింగ్ సినిమాలకు వత్తాసు పలకడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. రాబోతున్న సంక్రాంతికి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిరంజీవి ‘వాల్టేర్ వీరయ్య’ లు ఒకదానిపై ఒకటి పోటీగా విడుదల అవుతున్నాయి.


అయితే ఈ పోటీని లెక్కచేయకుండా దిల్ రాజ్ విజయ్ నటించిన ‘వారసుడు’ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తూ ఉండటంతో వివాదం మొదలైంది. ఒకవైపు చిరంజీవికి అత్యంత ఆత్మీయుడు సన్నిహితుడు అయిన అల్లు అరవింద్ తన బావ చిరంజీవి ‘వాల్టేర్ వీరయ్య’ కు సపోర్ట్ గా మాట్లాడకుండా విజయ్ డబ్బింగ్ సినిమా ‘వారసుడు’ ను వెనకేసుకు రావడం ఏమిటి అంటూ చిరంజీవి బాలకృష్ణ అభిమానులు కామెంట్స్ చేస్తున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: