పొన్నియన్ సెల్వన్ సినిమా విడుదలైన దగ్గరి నుంచి టాలీవుడ్ వెర్సెస్ కోలీవుడ్ అన్నట్టుగా మారిపోయింది. టాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఈ సినిమాను పెద్దగా ఆదరించలేదని, ఇక టాలీవుడ్ సినిమాలు కోలీవుడ్ లో విడుదలయితే తామేంటో నిరూపిస్తామంటూ కోలీవుడ్ సినీ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కానీ కంటెంట్ ఉంటే ఏ సినిమానైనా ఆదరిస్తామని తెలుగు ప్రేక్షకులు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఈ విషయం సెలబ్రిటీల మధ్య రాజుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక త్వరలోనే సంక్రాంతి పండుగ రాబోతున్న నేపథ్యంలో తమిళ్ సినిమాలను తెలుగులో సంక్రాంతి పండుగకు విడుదల చేయడానికి తెలుగు నిర్మాతల మండలి అంగీకరించలేదు.

ఒకవేళ తమిళ్ సినిమాలను సంక్రాంతి పండుగకు విడుదల కాకుండా అడ్డుకుంటే తెలుగు సినిమా లను తమిళ్లో విడుదల కాకుండా అడ్డుకుంటామంటూ తమిళ్ నిర్మాతల మండలి కూడా స్పష్టం చేసింది.  అయితే ఈ విషయం తారస్థాయికి చేరుతున్న నేపథ్యంలో కార్తికేయ 2 సినిమా ద్వారా భారీ విజయాన్ని అందుకున్న హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న సినిమాగా విడుదలైన కార్తికేయ 2 దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది. కానీ కోలీవుడ్ లో మాత్రం ఈ సినిమా పెద్దగా సక్సెస్ను అందుకోలేకపోవడమే కాదు అక్కడ కలెక్షన్స్ కూడా పెద్దగా రాబట్టలేక పోయింది.

ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నిఖిల్ మీడియాతో మాట్లాడుతూ కోలీవుడ్ ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. కార్తీకేయ 2 తమిళంలో మాత్రమే భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలవలేదు..  పైగా  తమిళంలో అధిక పన్ను రేట్లు ఉన్నాయి . పెద్ద సినిమాలకు  డబ్బు కూడా రాదని నిఖిల్ అన్నారు. అంతేకాదు కోలీవుడ్ లో తెలుగు సినిమా ల దుస్థితి టాలీవుడ్ హీరోలకు స్పష్టంగా తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: