‘ఆర్ ఎక్స్ 100’ మూవీ విడుదల తరువాత దర్శకుడు అజయ్ భూపతి పేరు మారుమ్రోగి పోయింది. అయితే చాల గ్యాప్ తీసుకుని చాల ఆలోచించి తీసిన ‘మహాసముద్రం’ ఫెయిల్ అవ్వడంతో అజయ్ భూపతిని ఇండస్ట్రీ వర్గాలు పెద్దగా పట్టించుకోవడంలేదు. అయితే దర్శకుడుగా తన సత్తా చాటాలి అన్న స్థిర నిర్ణయం తీసుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం యూత్ కు బాగా నచ్చుతున్న ఒక రస్టిక్ సినిమాను విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తీయబోతున్నట్లు వస్తున్నాయి.


తెలుస్తున్న సమాచారం మేరకు ఇది ఒక డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ అని హీరో విలన్ తో పాటు ఇంకా కీలకంగా ఉండే రెండు డజనుల పాత్రలు ఉంటాయని సినిమా చూసే ప్రేక్షకుడికి ఏపాత్రకు ఆపాత్ర హీరోగా కనిపిస్తుందని అంటున్నారు. ఈసినిమాకు దర్శకత్వంతో పాటు సహ నిర్మాతగా అజయ్ భూపతి వ్యవహరిస్తాడని తెలుస్తోంది.


ఈ నెలాఖరు నుండి షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈమూవీకి సంబంధించి మరొక ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈసినిమా షూటింగ్ కు సంబంధించి సుమారు 30 రోజులు నైట్ వర్కింగ్ ఉంటుందని టాక్. ఈసినిమాలో టాలీవుడ్ నటీనటులు మాత్రమే కాకుండా ఇతర భాషల నటీనటులను కూడ ఎంపిక చేయడం ద్వారా ఈమూవీని తెలుగుతో పాటు దక్షిణాది భాషలలోను అదేవిధంగా హిందీలో కూడ విడుదలచేయాలని అజయ్ భూపతి ఆలోచన అని తెలుస్తోంది.


‘ఆర్ ఎక్స్ 100’ బ్లాక్ బష్టర్ హిట్ అయినప్పటికీ ఆమూవీ దర్శకుడుతో పాటు హీరో హీరోయిన్స్ కు కూడ ఆ హిట్ వారి కెరియర్ రీత్యా ఏమాత్రం కలిసిరాలేదు. సాధారణంగా ఒక బ్లాక్ బష్టర్ హిట్ సినిమాలో నటించిన నటీ నటులకు ఆ మూవీ దర్శకుడుకి వరసపెట్టి అవకాశాలు రావడం సహజం. ఇప్పుడు ‘మహాసముద్రం’ ఇచ్చిన షాక్ తో ఉన్న అజయ్ భూపతి ఈమూవీకి ‘మంగళ వారం’ అన్న డిఫరెంట్ టైటిల్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: