రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కే జి ఎఫ్ మూవీ తో దేశవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ సలర్ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్మూవీ లో హీరోగా నటించడం కే జి ఎఫ్ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన మూవీ కావడంతో సలార్ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రభాస్ సరసన అందాల ముద్దు గుమ్మ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , పృథ్వీరాజ్ సుకుమరన్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. జగపతి బాబు ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుండగా ,  రవి బూస్రుర్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది.

అలాగే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లోని యాక్షన్స్ అన్ని వేశాలను తెరకెక్కించడంలో ప్రశాంత్ నీల్ అత్యంత శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన ఒక కీలక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే. .. ఈ మూవీ లోని క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలకు ప్రశాంత్ నీల్ అద్భుతంగా డిజైన్ చేసినట్లు , అలాగే ఈ యాక్షన్స్ అన్ని తెరకెక్కించడానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లను రంగం లోకి దింపనున్నట్లు తెలుస్తోంది. సలార్ మూవీ ని 28 సెప్టెంబర్ 2023 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: