బిగ్ బాస్ 6 వ సీజన్ చివరి దశకు చేరుకోవడంతో ఎవరు విన్నర్ అవుతారనే ఆసక్తి ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది.అయితే  ఈ తరుణంలోని బిగ్ బాస్ హౌస్ సభ్యులకు సరికొత్త టాస్క్ లు ఇస్తున్నారు.శనివారం ఎపిసోడ్ చూసిన వారంతా కూడా రేవంత్ ని గెలిపించడానికి బిగ్బాస్ బాగా ట్రై చేస్తున్నాడు అన్నట్లుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.ఇకపోతే  ముఖ్యంగా వారం మొత్తంలో హౌస్ లో ఏం జరిగింది? ఎవరి ఆట తీరు ఎలా ఉంది? తప్పులు ఎవరు చేశారు? ఎవరు కరెక్ట్ గా ఆడారు? అనేవి చెప్పే హోస్ట్ నాగార్జున శనివారం కూడా అలాగే చెప్పుకొచ్చారు.

 ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల ఆట తీరును మార్చేలా ఆదిరెడ్డి మాట్లాడుతున్నాడని , నాగార్జున ఆదిరెడ్డిని విమర్శించాడు.మాట్లాడితే.. బయటకు వెళ్ళిపోతా అంటున్నావు కదా! అంటూ వీడియో చూపించి మరీ విమర్శించడం మొదలుపెట్టారు. ఇక అందులో ఆది రెడ్డి ది తప్పు అని తేలడంతో బయటకు వెళ్లిపోతావా అని ప్రశ్నించాడు .అయితే  ఆ తర్వాత కూడా చాలా సేపు అతడినే టార్గెట్ చేస్తూ విమర్శిస్తూనే ఉన్నాడు నాగార్జున. ఇదిలావుంటే దాదాపు 20 నిమిషాల పాటు ఆదిరెడ్డిని నాగార్జున క్లాస్ పీకడం మాత్రమే చూపించారు . అయితే ఇక  ఇందులో నాగార్జున ఎన్ని అన్నా కూడా ఆదిరెడ్డి మాత్రం సారీ చెప్పలేదు.

ఇక ఈ ఎపిసోడ్ చూసినవారంతా కూడా రేవంత్ ను హైలైట్ చేయడానికి ఆదిరెడ్డికి క్లాస్ పీకారని ఈ సీజన్ కి రేవంత్ ను విన్నర్ ను చేయడానికి బిగ్బాస్ బాగా ప్రయత్నం చేస్తున్నాడని కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక రేవంత్ తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. కానీ  ఇక ఒక్కొక్కసారి లేడీ కంటెస్టెంట్ లపై విరుచుకుపడుతూ ఎన్నోసార్లు ఎలిమినేషన్స్ లిస్ట్ కి నామినేట్ కూడా అయ్యాడు. అభిమానుల అండ ఉండడంతో ఎలిమినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు. ఈసారి కూడా చివరిగా కెప్టెన్ బాధ్యతలు చేపట్టడంతో మరొకసారి కెప్టెన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే అందుకే ఎలాగైనా రేవంత్ ను విన్నర్ చేయడానికి బిగ్బాస్ సాయశక్తులా ప్రయత్నిస్తున్నాడని ప్రజలు గుసగుసలాడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: