నేటి తరం యంగ్ డైరెక్టర్ లలో ఒకరే ప్రశాంత్ వర్మ... తన కెరీర్ ను ఒక ఇంటెలిజెంట్ మూవీతో స్టార్ట్ చేసి ఎంతో మంది తన సినిమా గురించి ఆలోచించేలా చేశాడు. "అ!" అనే సినిమాతో కొత్త కథలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడంలో నేను ముందడుగు వేశాను అని నిరూపించాడు. కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ కాకపోయినా తన అటెంప్ట్ కు మరియు డైరెక్షన్ కు ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత తేజ అనే యువ హీరోతో కరోనా టైం లో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలాగా "జాంబి రెడ్డి" లాంటి జాంబీ మూవీని తీసి అందరి మెప్పును పొందాడు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని కొత్త కథకు హంగులు దిద్దడం మొదలెట్టాడు.

భారత పురాణాలలో సూపర్ హీరోగా ఉన్న ఆంజనేయుడు ను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని "హనుమాన్" అనే టైటిల్ తో సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఇలా ప్రశాంత్ వర్మ చేస్తున్న ప్రతి సినిమా దేనికదే కొత్త కాన్సెప్ట్ తో కొత్తదనాన్ని ఆశించే ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నాడు. ఈ రోజు హనుమాన్ టీజర్ ను ప్రశాంత్ వర్మ రిలీజ్ చేశాడు. అయితే ఆడియన్స్ స్పందన చూస్తుంటే టీజర్ అందరికీ బాగా నచ్చిందని అర్ధమవుతోంది. టీజర్ లో గ్రాఫిక్స్ ను అద్భుతంగా చూపించారంటూ డైరెక్టర్ ను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో పోల్చుతూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాపై ఎంత హైప్ ఉందో తెలియదు. కానీ టీజర్ తర్వాత మాత్రం సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

సినిమా డిసెంబర్ నెలాఖరులో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హనుమాన్ కనుక హిట్ సాధిస్తే తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న స్టార్ డైరెక్టర్ లలో ఒకరిగా ప్రశాంత్ వర్మకు స్థానం దక్కే అవకాశం ఉంది. దీని తర్వాత మరో రెండు సినిమాలు కూడా తీయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అందులో ఒకటి "అధీరా" కాగా మరొకటి లేడీ ఓరియెంటెడ్ మూవీ అని వార్త.

మరింత సమాచారం తెలుసుకోండి: