బిగ్ బాస్ సీజన్ 6 ప్రస్తుతం 11 వారాలు కంప్లీట్ చేసుకుని 12వ వారంలోకి అడుగు పెట్టింది. 21 మందితో మొదలైన ఈ సీజన్ 11 వారాలు ముగిసే సరికి 12 మంది కంటెస్టంట్స్ ఎలిమినేట్ అయ్యీ ప్రస్తుతం 9 మంది కంటెస్టంట్స్ తో నడుస్తుంది. సాధ్యమైనంత వరకు ఆడియన్స్ ని ఎక్సైట్ చేసేలా కంటెంట్ ఇవ్వాలని చూస్తున్న బిగ్ బాస్. ఈ సీజన్ మొదటి నుంచి ఈ హౌస్ మెట్స్ వల్ల నిరుత్సాపడుతున్నారు. ఎలాగోలా ఈ సీజన్ ని ముగించాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఎప్పుడు లేనిది ప్రైజ్ మనీలో టాస్కులంటూ కోత మొదలు పెట్టాడు బిగ్ బాస్. ఇదొక రకంగా హౌస్ మెట్స్ కి బొక్కే అని చెప్పొచ్చు.

ఇక ఇదిలాఉంటే ఈ సీజన్ విన్నర్ ని ఇప్పటికే డిసైడ్ చేశారు ఆడియన్స్. ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ ఉన్న ఇండియన్ ఐడల్ సింగర్ రేవంత్ కే టైటిల్ ఇచ్చేయాలని బిగ్ బాస్ టీం కూడా ఫిక్స్ అయినట్టు ఉంది. అందుకే అతన్ని వెనకేసుకుని వస్తుంది. ఆటలోనే కాదు బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ చేస్తున్న కొన్ని పనుల వల్ల హౌస్ మెట్స్ ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా తను కెప్టెన్ గా ఉన్నప్పుడు ఫుడ్ విషయంలో కూడా రిస్టిక్షన్స్ కొందరికి నచ్చట్లేదు. అయితే రేవంత్ ప్రతి టాస్క్ లో తన బెస్ట్ ఇస్తూ వచ్చాడు. అతను ఆట తీరు అందరిని మెప్పించింది. అయితే టాస్క్ ఎలగోలా గెలవడం కాదు హౌస్ మెట్స్ మనసులు గెలుచుకోవాలి.

రేవంత్ ఆ విషయంలో వెనకపడ్డాడు. అయితే రేవంత్ కాకుండా టైటిల్ విజేత ఎవరు అంటే చెప్పడం కష్టం. రేవంత్ తర్వాత ఎక్కడో ఉన్నాడు శ్రీహాన్. అతనికి విన్నర్ అయ్యే ఛాన్సులు ఉన్నా అతని అతి వల్ల అది దూరమయ్యేలా ఉంది. ఇక ఆది రెడ్డి కూడా చివరి వారాల్లో ఏమన్నా మ్యాజిక్ చేస్తే మాత్రం అతనికి టైటిల్ గెలిచే ఛాన్స్ ఉంది. ఫైమా కూడా టైటిల్ రేసులో ఉంది. అయితే వీరందరికన్నా బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా టైటిల్ గెలిచే ఎక్కువ శాతం ఛాన్స్ రేవంత్ కే ఉందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: