ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ ఆరవ సీజన్ ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే గత సీజన్లతో పోల్చి చూస్తే ఎంటర్టైన్మెంట్ కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ ఇక అలా అలా బిగ్ బాస్ కార్యక్రమం మాత్రం ముందుకు సాగిపోతుంది. ఇక ఇప్పుడు ఏకంగా చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లలో టాప్ ఫైవ్ లో నిలిచే కంటెస్టెంట్లు ఎవరు అనే దానిపై అటు ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులందరూ కూడా తమ అంచనాలను వేస్తూ ఉన్నారు. అంతేకాకుండా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అనుకున్న వారే కొన్ని కొన్ని సార్లు ఏకంగా బిగ్ బాస్ నుంచి వెళ్లిపోతున్న నేపథ్యంలో ఎవరు ఉంటారో ఎవరు వెళ్తారో అన్న కన్ఫ్యూజన్ కూడా కొంతమంది ప్రేక్షకుల్లో నెలకొంది అని చెప్పాలి.


 ఇక ప్రతి సీజన్లో లాగానే ఈ సీజన్లో కూడా తమకు నచ్చిన కంటెస్టెంట్లకు ఓట్లు వేసి ఇక ఎలిమినేషన్ నుంచి తప్పించి ఏకంగా టాప్ ఫైవ్ కు వెళ్లే విధంగా సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు హౌస్ బయట ఉన్న ప్రేక్షకులు. ఇకపోతే ఇటీవలే ప్రస్తారమైన ఆదివారం ఎపిసోడ్లో ఏకంగా నాగార్జున కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంటర్ ఇచ్చిన ఆది రెడ్డికి తెగ క్లాస్ పీకడం చూపించారు. అయితే ఎపిసోడ్ చూసిన వారంతా రేవంత్ ను హైలైట్ చేయడానికి ఆదిరెడ్డికి క్లాస్ పీకారని అనుకుంటున్నారట. అంతేకాకుండా  ఈ సీజన్కి రేవంతం బిగ్ బాస్ విన్నర్ చేయడానికి బిగ్బాస్ నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.


 అయితే హౌస్ లోకి ఎంట్రీ చేసిన నాటి నుంచి సింగర్ రేవంత్ తనదైన ఆటతీరుతో ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఒక్కోసారి లేడీ కంటెస్టెంట్ లపై కూడా విరుచుకుపడుతూ ఎన్నోసార్లు ఎలిమినేషన్స్ లిస్టు కి కూడా నామినేట్ అయ్యాడు రేవంత్. కానీ అతనికి అప్పటికే బయట అభిమానుల అండ ఉండడంతో ఇక ఎలిమినేషన్స్ నుంచి వరుసగా సేవ్ అవుతూ వస్తున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ నిర్వాహకులు ఎలాగైనా రేవంత్ ను బిగ్ బాస్ విన్నర్ గా మార్చాలని భావిస్తున్నారు అని తెలుస్తుంది.  మరి ఇది ఎంతవరకునిజం అన్నది మాత్రం ఎవరికీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: