ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లకు సమఉజ్జీగా ఒక వెలుగువెలిగిన కాంతారావు 400ల సినిమాలలో నటించిన గొప్ప నటుడు. అలాంటి టాప్ హీరో తన చివరి దశలో చిన్నచిన్న పాత్రలు సినిమాలలో చేసుకునే స్థాయికి వెళ్ళిపోయాడు అంటే ఎవరికైనా జాలి కలుగుతుంది. కనీసం టివి సీరియల్స్ లో కూడ ఆయనకు అవకాశాలు రాకపోవడంతో ఉన్న ఆస్థి అంతా కరిగిపోయి చివరకు ఒక చిన్న అపార్ట్మెంట్ లో అద్దెకు ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది.




తెలంగాణ ప్రాంతం నుండి మొట్టమొదటి స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన కాంతారావు అనుభవం లేకుండా సినిమాల నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడం వల్ల అతడి ఆస్థి అంతా కరిగిపోయింది అంటారు. చెన్నై నుండి హైదరాబాద్ అవకాశాల కోసం షిఫ్ట్ అయిన తరువాత కాంతారావు ఒక బ్యాగ్ పుచ్చుకుని సాధారణ వ్యక్తిలా రైతు బజార్ లో కూరలు కొనుక్కున్నప్పుడు ఆసంఘటనకు సంబంధించిన ఫోటో అప్పట్లో వైరల్ గా మారింది.



తెలుగు సినిమా రంగానికి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లు రెండు కళ్ళు అయితే కాంతారావు కళామతల్లి నుదిటి తిలకం లాంటి వాడు అంటూ ఎందరో పొగడ్తలు కురిపించారు. ప్రస్తుతం కాంతారావు శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ స్థాయిలో కూడ కొన్ని కార్యక్రమాలు చేసారు. అయితే కాంతారావు దీన స్థితి గురించి ఎవరు పట్టించుకోకపోవడం ముఖ్యంగా ఇండస్ట్రీ ప్రముఖులు కూడ పట్టించుకోకపోవడం చాలామందిని కలచివేస్తోంది.




కాంతారావుకు ఇద్దరు కుమారులు ఉన్నప్పటికీ వారికి కూడ సరైన ఉద్యోగం జీవనోపాది లేదు. చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. దీనితో వారిలో ఎవరో ఒకరికి ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగం అయినా ఇప్పించమని ఎందరో అడుగుతున్నప్పటికీ ఎక్కడా ప్రభుత్వాల నుండి స్పందన రావడంలేదు. కాంతారావు కుటుంబానికి ప్రభుత్వం నుండి కనీసం డబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ అయినా ఇప్పించమని ఎన్నో విజ్ఞప్తులు వస్తున్నప్పటికీ వాటిపై కూడ ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోవడంతో కాంతారావు కుటుంబాన్ని ఆదుకోమని ఒకనాటి ఆయన అభిమానులు కోరుతున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: