టాప్ యంగ్ హీరోల నుండి మీడియం రేంజ్ హీరోల వరకు తాము ఎలాంటి సినిమాల కథలను ఎంచుకుంటే అవి హిట్ అవుతాయో తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే నందమూరి సింహం బాలకృష్ణ మాత్రం వరసపెట్టి సినిమాలను లైన్ లో పెడుతూ ఆసినిమాలను వేగంగా పూర్తి చేస్తున్నాడు. అంతేకాదు మరొక వైపు తన బాడీ లాంగ్వేజ్ మార్చి ఆహా లో ‘అన్ ష్టాపబుల్’ షోలో చెలరేగిపోతు యంగ్ హీరోలకు షాక్ ఇస్తున్నాడు.


ప్రస్తుతం బాలకృష్ణ కు 64 సంవత్సరాలు అయినప్పటికీ తన ఏజ్ ని ఎక్కడా కనపడనీయకుండా యంగ్ హీరోయిన్స్ తో రొమాన్స్ కు రెడీ అవుతున్న బాలయ్య స్పీడ్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ ఫినిషింగ్ స్టేజ్ లో ఉండగానే డిసెంబర్ మొదటి వారం నుండి అనీల్ రావిపూడితో కలిసి చేయవలసిన మూవీని లైన్ లో పెడుతున్నాడు.


ఈమూవీలో బాలకృష్ణ నాల్గవసారి నయనతార తో కలిసి నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈమూవీలో నటించినందుకు నయనతార 4 కోట్లు డిమాండ్ చేసినప్పటికీ బాలయ్య నయతారల కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ రీత్యా ఆమెకు ఈ భారీ పారితోషికం ఇస్తున్నట్లు టాక్. అనీల్ రావిపూడి మూవీలో బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ ను విలన్ గా పరిచయం చేస్తున్నారు.



ఇక ఈమూవీలో బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తోంది. బాలకృష్ణ చాలకాలం తరువాత ఈమూవీలో 60 సంవత్సరాల వయసు ఉన్న పెద్దవాడుగా కన్పిస్తూ చాలా రొమాంటిక్ భావాలు ఉన్న పెద్ద వ్యక్తిగా డిఫరెంట్ గెటప్ లో బాలయ్య కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు ఇలా లైన్ లో పెడుతూ మరొక వైపు ఆహా లో అన్ ష్టాపబుల్ షోను పరుగులు తీయిస్తున్న బాలయ్య స్పీడ్ ను చూసిన ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతూ మరో 10 సంవత్సరాలు బాలయ్య స్పీడ్ ఇలాగే కొనసాగినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు..




మరింత సమాచారం తెలుసుకోండి: