ఈవారం థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన మూడు సూపర్ హిట్ చిత్రాలు ఓటీటీ లో స్ట్రీమింగ్ అవడానికి సిద్ధమవుతున్నాయి. కరోనా వచ్చిన తర్వాత ఓటీటీ మార్కెట్ బాగా పుంజుకుంది. కారణాలు ఏవైనా సరే ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం ఎక్కువగా ఓటీటీల వైపే ముగ్గు చూపుతున్నారు. ఇక వారికి అనుగుణంగా ప్రముఖ ఓటీటీ సంస్థలు కూడా ప్రతివారం సరికొత్త వెబ్ సిరీస్ లతో పాటు సూపర్ హిట్ సినిమాలను కూడా స్ట్రీమింగ్ చేస్తున్నాయి. మరి ఈ క్రమంలోనే ఈవారం థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన మూడు సూపర్ హిట్ చిత్రాలు ప్రస్తుతం ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధమవుతున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.


ప్రిన్స్:
జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కె.వి డైరెక్షన్లో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం ప్రిన్స్ ఇందులో మారియా ర్యాబోషప్క హీరోయిన్ గా వెండితెరకు పరిచయం కాబోతోంది. ఈ సినిమా తెలుగు,  తమిళ్ భాషలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.. కామెడీ ఎంటర్ టైనర్ గా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది.  కానీ ఓటీటీ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు శుభవార్త అని చెప్పాలి.  నవంబర్ 25వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.

కాంతారా:
కన్నడలో చిన్న సినిమాగా విడుదలయ్యి పాన్ ఇండియా వైడ్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న కాంతారా సినిమా ప్రస్తుతం అన్ని భాషల్లో కూడా బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకుంది.  వసూళ్లపరంగా ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా నవంబర్ 24 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానున్నట్లు సమాచారం.


చుప్:
దుల్కర్ సల్మాన్ , శ్రియ ధన్వంతరి హీరో హీరోయిన్లు దర్శకుడు ఆర్ బాల్కి తెరకెక్కించిన చిత్రం చుప్.. తీవ్ర విమర్శలు చేసే ఫిలిం క్రిటిక్స్ పై ఒక ఆర్టిస్ట్ రివేంజ్ తీర్చుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా కథాంశం. సన్నీ డియోల్ ఇందులో కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా కూడా 25వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ Zee 5  లో స్ట్రీమింగ్ కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: