లవ్ టుడే అనే తమిళ సినిమా నవంబర్ 25 వ తేదీన తెలుగు భాషలో విడుదల కావడానికి రెడీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించాడు. ఈ మూవీ లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే లవ్ టు డే సినిమా తమిళం లో భారీ ఎత్తున నవంబర్ 4 వ తేదీన విడుదల అయింది. మంచి అంచనాల నడుమ తమిళ భాషలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది.

దానితో ఈ మూవీ కి ప్రస్తుతం తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు కూడా లభిస్తున్నాయి. ఇలా ఇప్పటికే తమిళ ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ మూవీ ని నవంబర్ 25 వ తేదీన ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ స్థాయిలో తెలుగు లో విడుదల చేయడానికి ఏర్పాటు చేస్తున్నాడు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశాడు. ఈ మూవీ ట్రైలర్ అద్భుతంగా ఉండడం తో , ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా లవ్ టుడే మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది.

మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. లవ్ టు డే సినిమా 2గంటల 34 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి లైవ్ టుడే సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: