అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.ఆ సినిమా హిట్ అవ్వడంతో వరుస సినిమాలలో నటించింది.ఎన్నో హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ అయ్యింది.గత కొన్నేళ్ళు తక్కువ సినిమాలతో అలరించింది.ఆ తర్వాత  బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజిగా ఉంది.ఇటీవల భీమ్లా నాయక్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిత్యా.. అటు వెండితెరపైనే కాకుండా,బుల్లి తెరపై కూడా తళుక్కుమంది..


ఇటు డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ అలరిస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మాత్రం ఎప్పుడూ నెట్టింట హల్చల్ చేస్తుంటారు. ఇటీవల ప్రెగ్నెసీ టెస్ట్ కిట్ షేర్ చేసి షాకిచ్చిన నిత్యా.. గత రెండు రోజుల క్రితం ఏకండా బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేసింది. దీంతో నిత్యాకు పెళ్లి ఎప్పుడూ జరిగింది.. అంటూ సందేహాలు వ్యక్తం చేశారు. అయితే నిత్యా పోస్టుల వెనక మరో కథ ఉందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న ది వండర్ ఉమెన్ ప్రమోషన్లలో భాగంగానే ఈ అమ్మడు బేబీ బంప్ ఫోటోస్ సోషల్ మీడియాలో పంచుకుందని తెలియడంతో అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. ఇక తాజాగా పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది నిత్యా..


ప్రస్తుతం ఆమె నటిస్తోన్న వండర్ ఉమెన్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో నిత్యా గర్భవతిగా కనిపించనుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిత్యాకు పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురుకావడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేను పక్కా ట్రెడిషనల్ అమ్మాయిని. మన కల్చర్… సంప్రదాయాలని గౌరవిస్తాను. పెళ్లంటే ఒక సోషల్.. ఫైనాన్సియల్ సెటప్. అలాంటివాడితో పెళ్లి ముడిపడి ఉంది. నాకు అలాంటి సెటప్ కోసం అయితే పెళ్లి అవసరం లేదు..అంతకు మించి ఉంటే చుద్దామని చెప్పింది..అంటే పెళ్ళి చేసుకోనే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేసింది..ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: