యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి.. నటన గురించి .. ప్రతిభ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుసగా 6 సూపర్ హిట్లతో డబుల్ హ్యాట్రిక్ కొట్టి ఫుల్ జోష్లో ఉన్నారు ఎన్టీఆర్. ఇటీవల ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదలయ్యే దాదాపు 8 నెలలు అవుతున్నా ఇంకా అదే హ్యాపీ మూడ్ లో ఉన్నాడు ఎన్టీఆర్.. ఇటీవల జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్ లో భాగంగా జపనీస్ లాంగ్వేజ్ లో మాట్లాడి తన టాలెంట్ తో అందరూ ఆశ్చర్యపోయాలా చేశారు. ప్రస్తుతం కొరటాల శివతో చేయబోయే సినిమా అప్డేట్ గురించి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న నేపథ్యంలో సాలిడ్ సర్ప్రైజ్ ఇచ్చాడని చెప్పవచ్చు.

ప్రస్తుతం ఎన్టీఆర్ కి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ రావడంతో ఇప్పుడు అదే ట్రెండీ టాపిక్ గా మారిపోయింది. పూర్తి వివరాల్లోకెళ్తే ఒకవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉండే ఎన్టీఆర్ మరొకవైపు బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్, మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి షోలే కాకుండా పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ దుమ్ము దులిపేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన ఖాతాలో ఇప్పుడు మరో కొత్త బ్రాండ్ వచ్చి చేరిందని చెప్పవచ్చు. "మేకింగ్ ఏ స్పెషల్ ఎంట్రెన్స్ సూన్" అంటూ త్వరలో బ్లాక్ బాస్టర్ ఇవ్వనున్నట్టు ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

పాపులర్ ఇండియన్ ఫుడ్ డెలివరీ "హబ్ లిసియస్ ఫుడ్స్" కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఇటీవలే ఈ బ్రాండ్ ఎండార్స్మెంట్ కి సంబంధించిన షూట్ లో కూడా పాల్గొన్న ఎన్టీఆర్.. ఆయనకు సంబంధించి న్యూ లుక్ ను విడుదల చేయగా సినిమాకు సంబంధించిన న్యూ లుక్ అని అందరూ అనుకున్నారు కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ న్యూ లుక్ కూడా ప్రకటనలో భాగమే అని స్పష్టం అవుతోంది. 'జరగబోయే సంచలనం ఊహించగలరా ?" అంటూ హింటిస్తూ వస్తున్న లిసియస్ ఫుడ్స్ తమ బ్రాండ్ కి ఎన్టీఆర్ ప్రమోషన్ చేయనున్నట్లు తమ అఫీషియల్ సోషల్ మీడియా పేజీ ద్వారా పోస్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: