సీనియర్ హీరోలు చిరంజీవి బాలకృష్ణ లు వరసపెట్టి సినిమాలు చేస్తూ దూసుకు పోతుంటే నాగార్జున మటుకు పూర్తిగా కన్ఫ్యూజన్ లో పడిపోతున్నాడు. వెండితెర మన్మధుడుగా ఒక వెలుగు వెలిగిన నాగార్జున లుక్ లో తేడా వచ్చినప్పటికీ ఇప్పటికీ తాను రొమాంటిక్ యాక్షన్ హీరోనే అని భావిస్తూ ఉండటంతో కథల ఎంపిక విషయంలో నాగార్జున చేస్తున్న పొరపాట్లు వల్ల అతడి సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి.


ఎందరో యంగ్ డైరెక్టర్స్ ను నమ్మి మంచి సినిమాలు తీయించి హిట్స్ అందుకున్న నాగ్ ప్రస్తుత తరం ప్రేక్షకుల మారిన అభిరుచిని అంచనా వేయలేకపోతున్నాడా అన్న సందేహాలు కూడ కలుగుతున్నాయి. వాస్తవానికి నాగ్ తన లేటెస్ట్ మూవీని ఎవరైనా సీనియర్ డైరెక్టర్స్ తో చేయాలని భావిస్తూ వచ్చాడు. అయితే సీనియర్ డైరెక్టర్స్ అందరూ ప్రస్తుతం బిజీగా ఉండటంతో తన దగ్గరకు వస్తున్న ఏ యంగ్ డైరెక్టర్ సమర్థత పై నమ్మకం ఉంచాలో తెలియని కన్ఫ్యూజన్ నాగ్ కు ఉంది అని అంటున్నారు.


ఇలాంటి పరిస్థితులలో బెజవాడ ప్రసన్న అనే యంగ్ రైటర్ చెప్పిన కథ నాగార్జునకు బాగా నచ్చింది అని అంటున్నారు. అయితే ఈకథను సరిగ్గా తీయగల సమర్థుడి కోసం నాగార్జున అన్వేషణ సాగిస్తున్నప్పటికీ ఎవరు సరిగ్గా సెట్ అవడం లేదని టాక్. దీనితో ధైర్యం చేసి తనకు కథను చెప్పిన బెజవాడ ప్రసన్నకు దర్శకత్వ బాధ్యతలు అప్పచెపితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు కూడ నాగ్ కు వస్తున్నట్లు తెలుస్తోంది.


గతంలో నాగార్జున ఏమాత్రం అనుభవం లేని రామ్ గోపాల్ వర్మకు అవకాశం ఇచ్చి ‘శివ’ లాంటి బ్లాక్ బష్టర్ అందుకున్నాడు అయితే అప్పటికాలానికి ఇప్పటికాలానికి పరిస్థితులలో మార్పులు ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. దీనితో చేయి తిరిగిన దర్శకులు కూడ తాము తీసే సినిమా రిజల్ట్ పై ఖచ్చితమైన నిర్ణయానికి రాలేకపోతున్నారు. దీనితో బెజవాడ ప్రసన్న ఎలాంటి ట్విస్ట్ నాగ్ కెరియర్ కు ఇవ్వబోతున్నాడు అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: