దర్శకుడు ప్రశాంత్ వర్మ కేవలం 30 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న త్రీడీ మూవీ హనుమాన్ టీజర్ కు వస్తున్న స్పందన చూసి ప్రభాస్ అభిమానులు షాక్ అవుతున్నారు. ‘ఆదిపురుష్’ మూవీని 4వందల కోట్ల బడ్జెట్ తో తీస్తూ ఆమూవీ గ్రాఫిక్ వర్క్స్ పై ఏకంగా 200 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వార్తలు రావడంతో ఆమూవీ టీజర్ పై ఎన్నో భారీ అంచనాలను ప్రభాస్ అభిమానులు పెట్టుకున్నారు.


అయితే వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ ‘ఆదిపురుష్’ టీజర్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈమూవీలోని గ్రాఫిక్స్ చిన్న పిల్లల వీడియో గేమ్స్ స్థాయిలో ఉన్నాయని అనేకమంది విమర్శలు చేయడంతో ఆ విమర్శలు తట్టుకోలేక ‘ఆదిపురుష్’ విడుదలను వాయిదా వేసారు. ఇప్పుడు మళ్ళీ ఈమూవీకి సంబంధించిన గ్రాఫిక్ వర్క్స్ ను రీ డిజైనింగ్ చేయడమే కాకుండా ఆ పనిని చేయడానికి అమెరికాకు కెనడాకు చెందిన రెండు గ్రాఫిక్ కంపెనీలకు ఆ పనిని అప్పచెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.


అయితే ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ‘హనుమాన్’ టీజర్ చాల బాగుండటమే కాకుండా ఆ టీజర్ లో జలపాతాలు భారీ కొండలు మంచుకొండలు గ్రాఫిక్స్ ద్వారా క్రియేట్ చేసినవి అత్యంత సహజంగా కనిపిస్తూ ఈసినిమాకు కేవలం 30 కోట్ల బడ్జెట్ ఎలా సరిపోయింది అన్న సందేహాలు ప్రభాస్ అభిమానులకు వచ్చేలా పరిస్థితులు ఏర్పడ్డాయి.


వాస్తవానికి ‘ఆదిపురుష్’ మూవీని ప్రపంచంలోని 40 భాషలలో విడుదల చేయాలని దర్శకుడు ఓమ్ రౌత్ భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య తీస్తున్నాడు. అయితే ఒక చిన్న సినిమా ‘హనుమాన్’ కు వచ్చిన స్పందన ‘ఆదిపురుష్’ ఎందుకు రావడం లేదు అన్న సందేహం చాలామందికి కలుగుతుంది. ‘బాహుబలి’ తరువాత సరైన హిట్ లేక బాధపడుతున్న ప్రభాస్ కెరియర్ కు ‘ఆదిపురుష్’ విజయం అత్యంత కీలకంగా మారింది. దీనితో ఈమూవీ హిట్ కి హిట్ టాక్ రాకపోతే ప్రభాస్ పరిస్థితి ఏమిటి అన్న భయాలు అతడి అభిమానులకు విపరీతంగా ఉన్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: